ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని కోయంబత్తూర్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తుల నడుమ శివనామ స్మరణతో ఈశా కేంద్రం మార్మోగుతోంది. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రాంగణం నిండిపోయింది.
శివరాత్రి వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్.. వెంకయ్యకు స్వాగతం పలికారు. ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, పూజా మందిరాలను ఉపరాష్ట్రపతికి చూపించారు. మహాశివుడి భారీ ప్రతిమ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు, నృత్యాలను ఆసక్తిగా తిలకించారు వెంకయ్య.
అనంతరం మహా శివలింగం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి. శివలింగానికి హారతి ఇచ్చారు.