ETV Bharat / bharat

ఫడణవీస్, రౌత్​​ల రహస్య భేటీతో వేడెక్కిన 'మహా' రాజకీయం - Saamana interview news on MH politics

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​, శివసేన ఎంపీ సంజయ్​రౌత్​ రహస్యంగా సమావేశమవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరివురి భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది.​

Devendra Fadnavis and Shiv sena MP Sanjay Raut
ఆ నాయకుల​ రహస్య భేటీతో వేడెక్కిన 'మహా' రాజకీయం
author img

By

Published : Sep 27, 2020, 7:45 AM IST

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​, శివసేన ఎంపీ సంజయ్​రౌత్​ మధ్య శనివారం జరిగిన రహస్య భేటీ ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరు నాయకుల సమావేశంపై రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

'సామ్నా పత్రిక ఇంటర్వ్యూ కోసం ఫడణవీస్​, రౌత్​ కలిశారు. దానిపైనే చర్చించుకున్నారు. బిహార్ ఎన్నికల ప్రచారం నుంచి తిరిగొచ్చాక ఇంటర్వ్యూ ఇస్తానని ఫడణవీస్​ తెలిపారు. ఇందులో రాజకీయ కోణం లేదు' అని భాజపా ప్రతినిధి కేశవ్​ ఉపాధే తెలిపారు. 'సామ్నా పత్రిక కోసం శరద్​ పవార్​ను ఇంటర్వ్యూ చేశాను. ఫడణవీస్, రాహుల్​, అమిత్​ షాలను కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను' అని రౌత్​ అన్నారు. ఇతర పార్టీల నాయకులను కలవడం నేరమా.. అని వ్యాఖ్యానించారు రౌత్​.

అప్పటినుంచి వేరుగా..

2019లో మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో శివసేన, భాజపా కలిసి పోటీ చేశాయి. అనంతరం భాజపాను కాదని శివసేన.. ఎన్​సీపీ, కాంగ్రెస్​లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పటినుంచి రెండు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రౌత్​, ఫడణవీస్​లు సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: ట్రాన్స్‌జెండర్లకూ రక్షణ కల్పించాలంటూ సుప్రీంలో వ్యాజ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.