ETV Bharat / bharat

'నూతన విద్యా విధానంతో 'జ్ఞాన'భారతం సాధ్యం' - కేంద్ర విద్యాశాఖ

విప్లవాత్మక మార్పులతో నూతన విద్యా విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీనిపై పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ను 'ఈటీవీ భారత్' ఇంటర్వ్యూ చేసింది. నూతన విద్యావిధానం తీరు తెన్నులు, ఉపయోగాలపై మంత్రి పలు కీలక విషయాలు వెల్లడించారు.

Ramesh Pokhryal Nishank
'నూతన విద్యా విధానంతో 'జ్ఞాన'భారతం సాధ్యం'
author img

By

Published : Aug 13, 2020, 4:10 PM IST

ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చంతా నూతన విద్యా విధానంపైనే. 34 ఏళ్ల అనంతరం విద్యా వ్యవస్థకు మార్పులు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్​ఈపీ-2020పై ప్రజల్లో నెలకొన్న సందేహాలు సహా పలు ప్రశ్నలపై ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...

కేంద్ర మంత్రితో ఇంటర్వ్యూ

ప్రశ్న: నూతన విద్యా విధాన రూపకల్పనలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు?

జవాబు: ఇలాంటి కీలకమైన విధానాలను రూపొందిస్తున్నప్పుడు.. యావత్​ దేశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని రూపొందించే సమయంలో ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు చర్చించాము. లక్షలాది విద్యార్థుల తల్లిదండ్రులు, వైస్​ ఛాన్సలర్లు, 1000కిపైగా విశ్వవిద్యాలయాలతో మాట్లాడాము. దేశంలో 45వేలకుపైగా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాళ్లతోనూ చర్చలు జరిపాం. ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, ఎకాడమిక్​ నిపుణులను కలిశాం. విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చాం. ఎంతో సానపెట్టిన తర్వాతే ఇది సాధ్యపడింది. ఇప్పుడు దేశం అంతా ఈ విధానాన్ని హృదయపూర్వకంగా స్వాగతించింది.

ఇదీ చూడండి:- 'నవ భారత్​ నిర్మాణానికి కొత్త విద్యా విధానమే పునాది'

ప్రశ్న: ఈ విధాన్నాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఆర్థికంగా సన్నద్ధమైందా?

జవాబు: సహజంగా ఈ విషయం రాష్ట్రాలతో సహా గ్రామ స్థాయికి కూడా సంబంధించినది. అందువల్ల 2.5 లక్షల గ్రామాల నుంచి కూడా సలహాలు తీసుకున్నాం. 2.5 లక్షలకుపైగా సలహాలు మాకు అందాయి. ఆ తర్వాత 1,820 మంది నిపుణులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి.. ఈ నూతన విద్యా విధానంపై విస్తృతంగా విశ్లేషణలు జరిపాం. ఇలా జరగడం ప్రపంచంలోనే తొలిసారి అనుకుంటా. చాలా చర్చల అనంతరం ఇది ప్రజల ముందకు వచ్చింది.

ప్రశ్న: ఉన్నత విద్య కోసం కమిషన్​ ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది? ప్రస్తుత వ్యవస్థతో ఇది జోక్యం చేసుకున్నట్టు కాదా?

జవాబు: జోక్యం వంటిది ఏం ఉండదని నేను అనుకుంటున్నా. సమగ్ర వసతులు కల్పించడం ముఖ్యం. ఇప్పటివరకు యూజీసీ, ఐసీటీ, ఎన్​సీటీఈ ఉన్నాయి. కొన్ని కారణాలతో వేరువేరుగా పనిచేస్తున్నామని వీటికి అనిపించింది. అయితే ఇవన్నీ ఒకే వేదికపైకి రావాలని మాకు అనిపించింది. అందుకే ఈ కమిషన్​ను ఏర్పాటు చేస్తున్నాం. ఫలితంగా 3,4 కౌన్సిళ్లు 12 కోర్సులను నిర్దేశిస్తాయి.

ఒకటి విశ్లేషణ, గుర్తింపునిస్తుంది. మరొకటి తమ కార్యనిర్వాహక యంత్రాంగాన్ని నిర్దేశిస్తుంది. మూడో మండలి ఆర్థిక విషయాలను చూసుకుంటుంది. ఇలా నాలుగు కౌన్సిళ్లు ఉంటాయి. ఫలితంగా ప్రజలు అన్ని విషయాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంపొందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం.

ఇదీ చూడండి:- చదువుల రథం... సాగాల్సిన విధం!

ప్రశ్న: వృత్తి శిక్షణను తప్పనిసరి చేశారు. కానీ ఇందులో ఉపాధ్యాయుల కొరత ఉంది. మరి ఈ సవాలును ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది?

జవాబు: ఈ శిక్షణను ఇప్పుడే మొదలుపెట్టాం. కానీ సవాళ్లను ఎదుర్కోవాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. పాఠశాలలో నేర్చుకున్న చదువును విద్యార్థులు తమ జీవితాల్లో అమలు చేయలేకపోతున్నారు. ఇప్పటివరకు ఇదే జరిగింది. చదువుకున్నది ఒకటి.. బయట ప్రపంచం ఇంకోటి. అందువల్ల ఈ విషయంలో అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకే విద్య, వృత్తి వంటి వాటి మధ్య ఉన్న ఖాళీలను తొలగించాం.

ప్రశ్న: విదేశీ విద్యాలయాలను కూడా స్వాగతించారు. మరి దీన్ని ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుంది. మిగిలిన వర్సిటీలతో పోల్చుకుంటే అవి భిన్నంగా ఎలా ఉంటాయి?

జవాబు: దాదాపు 7.5-8 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్నారు. దీని ప్రకారం చూస్తే.. దేశం చాలా ఆదాయాన్ని కోల్పోతోంది. దీనితో పాటు ఒక్కసారి ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాలకు వెళితే భారత్​కు తిరిగిరారు. అందువల్ల భారత్​ నష్టపోవడమే కాకుండా.. వీరి నైపుణ్యాన్ని ఉపయోగించుకుని.. మిగిలిన దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనిని మార్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం. దేశంలోనే ఉండి చదువుకునేలా చర్యలు చేపడుతున్నాం. దేశంలో విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడానికి తీవ్రంగా శ్రమించాం. విదేశాల నుంచి నిపుణులు వచ్చినప్పటికీ.. వారు ఇక్కడి నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:- 'సంస్కరణల పథంతో భాగ్యోదయ విద్యావిధానం'

ప్రశ్న: విశ్వవిద్యాలయాల్లో గ్రేడింగ్​ వ్యవస్థపై ఊహాగానాలు పెరిగాయి. అదే జరిగితే.. వర్సిటీల మధ్య అసమానతలు పెరిగిపోవా?

జవాబు: అసలు అసమానతలు ఎందుకు పెరుగుతాయి? అన్ని ప్రమాణాలను పూర్తి చేయగలిగితేనే ముందుకు వెళతారు. విశ్లేషణల ఆధారంగానే మీ పురోగతి మీకు తెలుస్తుంది. దేశంలో 1000కిపైగా వర్సిటీలు 45 వేలకుపైగా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ 45 వేల కళాశాలల్లో 8000కు మాత్రమే స్వయంప్రతిపత్తి ఉంది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేసి చూపించాలని మిగిలిన కళాశాలలను కోరుతున్నాం. అందువల్ల వాటికి కూడా స్వయంప్రతిపత్తిని కల్పించే అవకాశముంటుంది. 11 వర్సిటీల కింద 700-800 కళాశాలలు ఉన్నాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఓ విశ్వవిద్యాలయం పరిధిలో 300కు మించి కళాశాలలు ఉండకూడదని ఈ విధానంలో స్పష్టం చేశాం. ఫలితంగా అన్నీ వాటి సామర్థ్యానికి తగ్గట్టు వృద్ధి చెందే అవకాశముంటుంది.

ప్రశ్న: ఈ నూతన విద్యా విధానంతో విద్యార్థులు ఎక్కువు ఖర్చుపెట్టాల్సి వస్తుంది. విశ్వవిద్యాలయాలు ఎక్కువ ఫీజులు తీసుకుంటాయి.

జవాబు: అసలు ప్రజలు ఇలాంటివి ఎందుకు ఆలోచిస్తారు? అలాంటిది ఏమీ జరగదు. విప్లవాత్మక మార్పులు జరగాల్సిందే. 10+2ను పూర్తిగా మార్చేశాం. 5+3+3+4 చేశాం. ఉన్నత విద్యలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఈ నూతన విద్యా విధానంతో దేశం అభివృద్ధి అవుతుందని.. జ్ఞానం పరంగా శక్తిమంతంగా మారుతుందని నేను విశ్వసిస్తున్నా.

ఇదీ చూడండి:- 'మన విద్యావ్యవస్థలో అమెరికా తరహా స్వేచ్ఛ కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.