ETV Bharat / bharat

కరోనా చికిత్సలో అజిత్రోమైసిన్ వాడొద్దని కేంద్రం నిర్ణయం!​

కరోనాతో ఆరోగ్యం విషమించి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు ఇచ్చే అజిత్రోమైసిన్​ ఔషధాన్ని వాడొద్దని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్​ వాడకాన్ని మాత్రం యథావిధిగా కొనసాగించనున్నట్లు వెల్లడించాయి.

The Ministry of Health and Family Welfare is likely to withdraw the use of Azithromycin
కోరనా చికిత్సలో కీలక అజిత్రోమైసిన్ వాడొద్దని కేంద్రం నిర్ణయం!​
author img

By

Published : Jun 13, 2020, 5:43 AM IST

కరోనా వైరస్​ చికిత్సలో అజిత్రోమైసిన్​ ఔషధాన్ని ఇకమీదట ఉపయోగించొద్దని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అది సరిగ్గా ప్రభావం చూపకపోవడమే కారణమని పేర్కొన్నాయి. యాంటీ వైరల్​ డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్​ వాడకాన్ని మాత్రం యథావిధిగా కొనసాగించునున్నట్లు తెలిపాయి.

కరోనా బారినపడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరిన రోగులకు అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కాంబినేషన్​తో చికిత్స అందిస్తారు. అయితే అజిత్రోమైసిన్​ అంత ప్రయోజనకరంగా లేదని అధికారులు తెలిపారు. కరోనా చికిత్స నిర్వహణకు కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ సవరించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.