రామమందిర భూమిపూజ కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యంగా రామ జన్మభూమిలోని రామ్‌లల్లా విగ్రహాన్ని అత్యద్భుతంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శ్రీరాముని ప్రతిమను తీర్చిదిద్దారు. దీపాల వెలుగులో రామ్‌లల్లా విగ్రహం ధగధగా మెరిసిపోతోంది.
-
#WATCH The idol of 'Ram Lalla' at the Ram Janambhoomi site in #Ayodhya.
— ANI (@ANI) August 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Prime Minister Narendra Modi will perform 'Bhoomi Poojan' for #RamTemple at the site later today. pic.twitter.com/eL29b500Mx
">#WATCH The idol of 'Ram Lalla' at the Ram Janambhoomi site in #Ayodhya.
— ANI (@ANI) August 5, 2020
Prime Minister Narendra Modi will perform 'Bhoomi Poojan' for #RamTemple at the site later today. pic.twitter.com/eL29b500Mx#WATCH The idol of 'Ram Lalla' at the Ram Janambhoomi site in #Ayodhya.
— ANI (@ANI) August 5, 2020
Prime Minister Narendra Modi will perform 'Bhoomi Poojan' for #RamTemple at the site later today. pic.twitter.com/eL29b500Mx
రామ జన్మభూమి ప్రాంగణాన్ని కూడా ప్రత్యేకంగా ముస్తాబు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. వేదిక ముందు వేసిన రంగురంగుల ముగ్గులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
రామమందిర శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీ నుంచి అయోధ్యకు బయలుదేరారు. 11:30 గంటలకు అయోధ్య చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 15నిమిషాల 15సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో భూమిపూజలోని కీలక క్రతువు ముగుస్తుంది. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ.
ఇవీ చూడండి:-