ETV Bharat / bharat

అన్​లాక్​ 1.0: ఆతిథ్యం, పర్యటకం సోమవారం షురూ - unlock in India

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ ఆంక్షలను సడలిస్తూ.. జూన్​ 8 (సోమవారం) నుంచి అన్​లాక్​ 1.0 అమలు చేస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆతిథ్య, పర్యటక రంగం సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, ఆలయాలు తెరుచుకోనున్నాయి. అయితే.. దిల్లీలో మాత్రం హోటళ్లు, బ్యాంకెట్​ హాల్స్​ మూసి ఉంటాయని స్పష్టం చేసింది కేజ్రీవాల్ సర్కార్.

The hospitality and tourism services starts from Monday
సోమవారం నుంచి ఆతిథ్య, పర్యటక సేవలు షురూ!
author img

By

Published : Jun 7, 2020, 4:35 PM IST

Updated : Jun 7, 2020, 6:55 PM IST

కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ ఆంక్షలకు సడలింపులు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు చేసి అన్​లాక్​ 1.0ను సోమవారం (జూన్​ 8) నుంచి అమలు చేయనున్నట్లు జూన్​ 30న వెల్లడించింది. అన్​లాక్​ 1.0లో భాగంగా ఆతిథ్య, పర్యటక రంగానికి అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, ప్రసిద్ధ ఆలయాలు, షాపింగ్​ మాల్స్​ తెరుచుకోనున్నాయి.

పుదుచ్చెరి, కేరళ, గోవా సహా పలు ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు పర్యటకం, ఆతిథ్య రంగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. రెస్టారెంట్లు, బీచ్​లు, హోటళ్లను ప్రారంభించాలని ఆయా రాష్ట్రాలు కొద్ది రోజులుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో పలు మార్గదర్శకాలతో అనుమతులు ఇచ్చింది. అయితే.. కరోనా విజృంభణ అధికంగా ఉన్న కంటైయిన్​మెంట్​ జోన్లలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు మూసి ఉంచాలని స్పష్టం చేసింది.

3 వేలకుపైగా చారిత్రక కట్టడాలు..

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పురావస్తు శాఖకు సంబంధించిన 3,691 స్మారక కట్టడాలను పర్యటకుల సందర్శన కోసం జూన్​ 8 నుంచి తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది సాంస్కృతిక శాఖ. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని సంబంధిత అధికారులకు సూచించారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ పటేల్​.

దిల్లీలో హోటళ్లకు బ్రేక్​..

కేంద్ర ప్రభుత్వం అన్​లాక్​ 1.0కు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో దిల్లీలో సోమవారం నుంచి మాల్స్​, రెస్టారెంట్లు, మతపరమైన ప్రదేశాలు తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే.. కరోనా విజృంభణ కొనసాగుతున్నందున హోటళ్లు, సమావేశ మందిరాలను(బ్యాంకెట్​ హాల్స్​)ను కొంతకాలం మూసే ఉంచుతామని ప్రకటించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అవసరమైతే వాటిని కరోనా రోగుల చికిత్స కోసం వినియోగిస్తామని తెలిపారు.

దేశ రాజధానిలో సోమవారం నుంచి షాపింగ్​ మాల్స్​ తెరుచుకోనున్నాయి. దిల్లీ ప్రభుత్వానికి సుమారు రూ. 500 కోట్లకుపైగా ఆదాయాన్ని చేకూర్చే ఈ 100కు పైగా చిన్నాపెద్ద షాపింగ్​ మాల్స్​ తెరిచేందుకు కేజ్రీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

ఆలస్యంగా పలు ప్రసిద్ధ ఆలయాలు..

సోమవారం నుంచే దేశంలోని పలు ఆలయాలు తెరుచుకుంటున్నప్పటికీ.. కేరళలోని శబరిమల అయ్యప్ప, అనంత పద్మనాభస్వామి, గురువాయూర్​ శ్రీకృష్ణ ఆలయాలు కాస్త ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. పద్మనాభస్వామి ఆలయం జూన్​ 9న, శబరిమల ఆలయం జూన్​ 14న, గురవాయూర్​ ఆలయం 15న తెరుచుకుంటాయి.

ఇదీ చూడండి: హోటళ్లు కళకళలాడాలంటే కొంతకాలం ఆగాల్సిందే!

Last Updated : Jun 7, 2020, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.