ETV Bharat / bharat

ఐదు రూపాయల డాక్టర్​ ఇక లేరు - chennai five rupees doctor

వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్న రోజుల్లో కేవలం ఐదు రూపాయలకే వైద్యం అందించి.. పేదల గుండెల్లో దేవుడిగా మారిన ఆ డాక్టర్​ ఇక లేరు. చెన్నైలో ఐదు రూపాయల వైద్యుడిగా సుపరిచితులైన డాక్టర్​ తిరివెంగదమ్​ వీరరాఘవన్(70)​ శనివారం రాత్రి కన్నుమూశారు.

The Five Rupee Doc from Chennai is no more
ఐదు రూపాయల వైద్యుడు ఇక లేరు
author img

By

Published : Aug 16, 2020, 3:44 PM IST

ఐదు రూపాయలకే వైద్యం అందించి.. నిరుపేదల గుండెల్లో దేవుడిగా నిలిచిన చెన్నై వ్యాసరపాడికి చెందిన డాక్టర్​ తిరివెంగదమ్​ వీరరాఘవన్ ఇక లేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ​

1973లో వ్యాసర్​పాడి అశోక స్తంభానికి సమీపంలోని ఎరుక్కంచెరి ప్రాంతంలో క్లినిక్​ స్థాపించారు వీరరాఘవన్​. అప్పటినుంచి నిరుపేదలకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్నారు. తొలుత కేవలం రూ.2 ఫీజుతో వైద్య సేవలు అందించేవారు. ప్రతిరోజు ఆయన క్లినిక్​ రోగులతో కిటకిటలాడేది. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు రోగులను పరీక్షించేవారంటే అతిశయోక్తి కాదు. కొద్ది రోజుల తర్వాత తన వద్దకు వచ్చేవారి ఒత్తిడితో ఫీజును రూ.5కు పెంచారు. అదే ఫీజుతో తన చివరి క్షణాల వరకు సేవలందించారు.

వీరరాఘవన్ జీవితగాథ ఆధారంగా తమిళ స్టార్​ హీరో విజయ్​ 'ఐదు రూపాయల డాక్టర్​'గా నటించిన చిత్రం 'మెర్సల్​' తో ఆయన సేవలు వెలుగులోకి వచ్చాయి.

2015లో వరదల్లో వీర రాఘవన్ క్లినిక్​ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి సమీపంలోని మరో ప్రాంతంలో క్లినిక్​ ఏర్పాటు చేసినప్పటికీ తన ఫీజును మాత్రం ఐదు రూపాయలుగానే కొనసాగించారు.

సున్నితంగా తిరస్కరించేవారు..

'ఎలాంటి ఫీజు చెల్లించకుండానే చదువుకున్నాను. మాజీ ముఖ్యమంత్రి కామరాజ్​​ విధానాలకు నా కృతజ్ఞతలు. అది రోగుల నుంచి డబ్బులు వసూలు చేయకూడదని నేను తీర్మానించుకునేలా చేసింది.' అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు వీరరాఘవన్​. స్థానికులు, సహచర వైద్యులు కనీసం రూ.100 ఫీజుగా తీసుకోవాలని కోరినా.. వారి మాటల్ని సున్నితంగా తిరస్కరించేవారు.

పిల్లలు కూడా వైద్యులే..

వైద్యులు వీరరాఘవన్​కు భార్య సరస్వతి, ఇద్దరు పిల్లలు ప్రీతి, దీపక్​ ఉన్నారు. వారు కూడా వైద్యులుగానే స్థిరపడ్డారు.

ప్రముఖుల సంతాపం...

వీరరాఘవన్​ మృతిపట్ల ఆయన కుటుంబానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​, తెలంగాణ గవర్నర్​ తమిళసై సౌందరరాజన్​ సంతాపం ప్రకటించారు.

ఇదీ చూడండి: చిన్నారి మృతదేహం జాడచూపిన పెంపుడు కుక్క!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.