ETV Bharat / bharat

భూటాన్​, మాల్దీవులకు కొవిషీల్డ్ టీకా డోసులు - india gift to nepal

సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ టీకా డోసులను భూటాన్​కు ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించింది భారత్​. ఇందుకు సంబంధించిన 1.5లక్షల టీకా డోసుల మొదటి కనసైన్​మెంట్​ ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భూటాన్​ రాజధాని థింపు నగరానికి బుధవారం బయల్దేరింది.

The first consignment of 1.5 lakh dosages of Covishield vaccine dispatched
భూటాన్​కు బయల్దేరిన టీకాలు
author img

By

Published : Jan 20, 2021, 10:12 AM IST

సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాలను భూటాన్​కు ఉచితంగా సరఫరా చేస్తోంది భారత్​. దీనికి సంబంధించి 1.5లక్షల డోసులతో తొలి కన్​సైన్​మెంట్ ముంబయిలోని ఛత్రపతి శివాడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భూటాన్​ రాజధాని థింపు నగరానికి బుధవారం బయలు దేరింది.

మాల్దీవులకు కూడా లక్షల డోసుల టీకాలను బుధవారమే ఎగుమతి చేయనుంది భారత్​. పొరుగు దేశాలకు ఔషధ ఉత్పత్తుల సాయం ఒప్పందంలో భాగంగా.. పలు దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపుతోంది భారత ప్రభుత్వం. కరోనా ప్రభావం నేపథ్యంలో భారత సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​ను పొరుగు దేశాలకు ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించించింది. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్, సీషెల్స్ దేశాలకు బుధవారం నుంచి కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయనుంది. శ్రీలంక, అఫ్గానిస్థాన్​​, మారిషస్ దేశాల నుంచి ఎంత అవసరమో ధ్రువీకరణ ఇంకా రాలేదన్న విదేశాంగ శాఖ.. వచ్చిన వెంటనే ఈ దేశాలకు కూడా టీకా సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.

మోదీ హర్షం..

ఇతర దేశాలకు టీకా అందించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య సంరక్షణ అవసరాలు తీర్చడానికి భారత్ విశ్వసనీయమైన భాగస్వామి పాత్ర పోషించడం గర్వకారణమని అన్నారు.

ఇదీ చూడండి: నడ్డా ఎవరు?.. నేను జవాబుదారీ కాదు: రాహుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.