భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ సాయంతోనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కీలకమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈనెల 10న ఆపరేషన్ నిర్వహించారు.
2012 నుంచి 2017 వరకు 13వ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు ప్రణబ్.
ఇదీ చూడండి 8 నెలలుగా తప్పిపోయి.. సరిహద్దుల్లో శవమై..