చిన్నపిల్లలతో కలిసి కారులో ప్రయాణించేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియజేస్తూ.. కేరళకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి కుమారుడితో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారు డోరు లాక్ చేయకపోవటం వల్ల మలుపు వద్ద డోర్ తెరచుకొని బాలుడు కిందపడ్డాడు. ఈ ఘటనలో అదృష్టం కొద్దీ బాలుడు స్వల్ప గాయాలతో బతికిబయటపడ్డాడు.
ఆ బాలుడు కారులో నుంచి కిందపడే సమయానికి ఎదురుగా బస్సు, బైక్.. పక్కనుంచి ఓ ఆటో వచ్చింది. బాలుడు కిందపడగానే అందరూ సడన్ బ్రేక్ వేయటం వల్ల అతనికి ప్రమాదం తప్పింది.
ఇదీ చూడండి:నానాజాతి సమితికి వందేళ్లు.. భారత్ సాధించిందేమిటి?