పబ్జీ మోజులోపడి మరో బాలుడు చేతులారా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పబ్జీ ఆడుకోవడానికి మొబైల్ ఇవ్వలేదని కర్ణాటక చిక్కబల్లాపుర్కు చెందిన యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.
![The boy committed suicide for Not giving the mobile to play PUBG in karnataka Chikkaballapura](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5477946_sang.jpg)
చిక్కబల్లాపుర్ జిల్లాలోని చేలూరు తాలుకాకు చెందిన యశ్వంత్ పబ్జీ ఆడుకోవడానికి తన అక్క అఖిలను ఫోన్ ఇవ్వమన్నాడు. అధికంగా మొబైల్ ఫోన్లు వాడడం ప్రమాదకరమని హెచ్చరించింది సోదరి. తాను పబ్జీ ఆడుకోకుండా చేసినందుకు కోపంతో ఊగిపోయాడు యశ్వంత్. క్షణికావేశంలో మొక్కలకు వాడే పురుగుల మందు తాగేశాడు.
కాసేపటికి తల్లిదండ్రులు గుర్తించి ఆసుపత్రిలో చేర్చారు. కానీ, మార్గ మధ్యంలోనే యశ్వంత్ చనిపోయాడని వైద్యులు తెలిపేసరికి బోరున విలపించారు కుటుంబ సభ్యులు.
ఇదీ చదవండి:'ప్రణాళిక ప్రకారమే 'పౌర' నిరసనల్లో హింస!'