ETV Bharat / bharat

సిక్స్​ప్యాక్​ పూజారి.. పూరీ జగన్నాథుని బాడీగార్డ్​!

సాధారణంగా సిక్స్​ప్యాక్ పర్సనాలిటీ చూస్తే ఎవరైనా చూపుతిప్పుకోవడం కాస్త కష్టమే. అయితే ఓ పూజారి అదే సిక్స్​ప్యాక్​తో పూరీ జగన్నాథుని రథయాత్రలో దర్శనమిచ్చాడు.​ ఇంకేముంది జంధ్యం వేసుకున్న ఈ బాహుబలి ఎవరో తెలుసుకోవాలని తాపత్రయ పడిన వారందరికీ.. సమాధానం విని ఆశ్చర్యం కలిగింది. అదే పూరీ జగన్నాథుని బాడీగార్డ్​ కథ.

సిక్స్​ప్యాక్​ పూజారి.. పూరీ జగన్నాథుని బాడీగార్డ్​!
author img

By

Published : Aug 4, 2019, 12:19 PM IST

Updated : Aug 4, 2019, 5:13 PM IST

సిక్స్​ప్యాక్​ పూజారి.. పూరీ జగన్నాథుని బాడీగార్డ్​!

కొద్ది రోజుల క్రితం కథ ఇది. పూరీ జగన్నాథుడి రథోత్సవం జరుగుతోంది.... అదే సమయంలో ఒక వ్యక్తి జంధ్యం వేసుకొని పంచెకట్టుకొని హడావుడిగా వెళుతున్నాడు.. అతని పర్సనాలిటీ అక్కడ ఉన్నవారిని చూపు తిప్పుకోనివ్వలేదు. ఎంతో అకుంఠిత దీక్షతో కష్టపడితేగానీ గ్రీకు శిల్పం వంటి ఆ దేహదారుఢ్యం సొంతం కాదు. అంతే చాలా కెమెరాలు అతడ్ని క్లిక్‌మనిపించాయి.

అక్కడకు సీన్‌ కట్‌ చేస్తే.. ఆ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అయ్యాయి. కండలు తిరిగిన ఈ అయ్యగారు ఎవరా? ఎవరీ పూజారి బాహుబాలి ? అని నెటిజన్లు గూగుల్‌ తల్లిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. సమాధానం విని ఆశ్చర్యపోయారు. ఆయన పూరీ జగన్నాథ ఆలయ పూజారి కుమారుడు. ప్రస్తుతం ఆలయంలో సేవలు చేస్తున్న వ్యక్తి. అంతకు మించి పక్కా శాకాహారి..! అతని పేరు అనిల్‌ గొచికర్‌. 'మిస్టర్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా' బంగారు పతక విజేత.

నమ్మక తప్పని నిజం...

30 ఏళ్లు దాటగానే "ఆ... ఈ ఏజ్‌లో జిమ్‌కు ఏం వెళతాం" అని నిరాశపడే వారికి గొచికర్‌ జీవితం స్ఫూర్తిదాయకం. అతను తొలిసారి జిమ్‌లో అడుగుపెట్టింది 30 ఏళ్ల వయస్సులోనే. క్రమం తప్పకుండా పద్ధతి ప్రకారం వ్యాయామం చేసి అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ కండల వీరుడు ఒడిశాలోని పూరీ వాసులకు మాత్రం జగన్నాథుడి బాడీగార్డ్‌గా సుపరిచితుడు.

తొలిసారే విజేతగా..

అనిల్‌ తొలిసారి ఒడిశాలో రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్​ పోటీల్లో పాల్గొన్నాడు. 65కేజీల విభాగంలో పాల్గొని ఛాంపియన్‌గా నిలిచాడు. 2012, 2016 మిస్టర్‌ ఒడిశా, 2016 మిస్టర్‌ ఇంటర్నేషనల్‌ బంగారు పతకం సాధించాడు.

ఇదీ చూడండి: 'అంతా అబద్ధం- క్లస్టర్​ బాంబులు వాడలేదు'

Chamoli (Uttarakhand), Aug 04 (ANI): Chamoli District Magistrate Swati S Bhadoriya held lunch at her residence August 03. The lunch were organised for 28 students of Anganwadi and Primary schools. The DM interacted with the children and listened to their problems.
Last Updated : Aug 4, 2019, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.