జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు.. తమను వెంటాడుతున్న సైనికుల నుంచి తప్పించుకోవడానికి కొండ ప్రాంతాలకు వెళ్లడం, స్థానికుల ఇళ్లలో ఆశ్రయం పొందడం పాత పద్ధతి. దట్టమైన పండ్ల తోటలు, కాలానుగుణంగా ప్రవహించే జల ప్రవాహాల నడుమ భూగర్భంలో బంకర్లు ఏర్పాటు చేసుకొని సైన్యం, భద్రతా దళాల కళ్లుకప్పడం నేటి పద్ధతి. ఈ విధంగా ఉగ్రవాదులు బంకర్ల సాయంతో రోజుల తరబడి దాక్కుంటున్నారని సైనిక ఉన్నతాధికారి కర్నల్ ఏకే సింగ్ తెలిపారు. ఇటీవల తనిఖీల్లో బయటపడిన బంకర్ల గురించి ఆయన వివరించారు.
"జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఎక్కువగా బంకర్లు బయటపడ్డాయి. వీటి నిర్మాణానికి ఇక్కడి దట్టమైన అడవులు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న యాపిల్ తోటలు అనుకూలంగా ఉండటమే కారణం. రంబీ అరా నది మధ్య భూగర్భంలో ముష్కరులు ఏర్పాటుచేసిన ఇనుప బంకర్ ఆశ్చర్యానికి గురిచేసింది."
- ఏకే సింగ్, సైన్యాధికారి
ఇదీ చూడండి: భవనం కూలిన ఘటనలో ఎనిమిదికి పెరిగిన మృతులు