ETV Bharat / bharat

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం - exgratia to deceased in kozhikode air accident

కోజికోడ్​ విమాన ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు కేంద్రం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి ఈ మేరకు వెల్లడించారు. కేరళ రాష్ట్రప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది.

ten lakhs exgratia to deceased in kozhikode air accident
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
author img

By

Published : Aug 8, 2020, 4:27 PM IST

కేరళలోని కోజికోడ్‌ విమాన ప్రమాద స్థలాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2 లక్షలు.. స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ఇస్తామని చెప్పారు.

ten lakhs exgratia to deceased in kozhikode air accident
ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి హర్​దీప్​సింగ్​ పూరి

రాష్ట్రప్రభుత్వం

కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా విమాన ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ మేరకు కోజికోడ్​ జిల్లాలో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం సీఎం​ పినరయి విజయన్​ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించారు ముఖ్యమంత్రి.

బాధితులను పరామర్శించడానికి వెళుతున్న సీఎం పినరయి విజయన్​

మరోవైపు విమాన ప్రమాదంపై దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. 22 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 149 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చిన్న గాయాలతో బయటపడిన 23 మంది తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

ప్రమాదానికి గురైన విమానం

ఇదీ చూడండి: భేష్‌..కరోనా భయం వెంటాడినా సాహసించారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.