గత కొద్ది రోజులుగా రాజస్థాన్‌లో వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. సోమవారం ఆ రాష్ట్రంలోని చురులో 50.3 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వరుసగా మూడు రోజులు చురులో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతోంది.
శ్రీగంగానగర్‌లో 48.8 డిగ్రీలు, బికనీర్‌లో 48.4, కోటాలో 47.4, జైసల్మేర్‌లో 47, బార్మర్‌లో 46.6, జైపుర్‌లో 45.8, అజ్మీర్‌లో 45.5, జోధ్‌పుర్‌లో 45.4, దబోక్లో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
మరో రెండు రోజుల పాటు పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతుందని వాతవరణ శాఖ వెల్లడించింది.
ఇప్పటివకు దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డూ రాజస్థాన్‌లోనే నమోదయింది. 2016, మే 19లో రాజస్థాన్‌లోని పలోదిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
ఇదీ చూడండి: 'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'