ETV Bharat / bharat

హురియత్ నయా చీఫ్ అష్రఫ్ సెహ్రాయ్ అరెస్ట్​

జమ్ముకశ్మీర్ పోలీసులు.. వేర్పాటు సంస్థ హురియత్ నేత అష్రఫ్ సెహ్రాయ్​ను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత జమాతే ఇస్లామీకి చెందిన 12 మందిని కూడా అరెస్టు చేశారు. వీరిపై ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tehreek-e-Hurriyat chairman Ashraf Sehrai arrested
హురియత్ నయా చీఫ్ అష్రఫ్ సెహ్రాయ్ అరెస్టు
author img

By

Published : Jul 12, 2020, 11:55 AM IST

Updated : Jul 12, 2020, 12:29 PM IST

వేర్పాటువాద సంస్థ హురియత్ నాయకుడు అష్రఫ్​ సెహ్రాయ్​ను, నిషేధిత జమాతే ఇస్లామీ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసు చీఫ్​ దిల్​బాగ్ సింగ్ తెలిపారు. వారిపై ప్రజా భద్రత చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు

"పాకిస్థాన్ అనుకూల తెహ్రీక్ ఏ హురియత్​ ఛైర్​పర్సన్​ అష్రఫ్​ సెహ్రాయ్​తో పాటు జమాతే ఇస్లామీకి చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నాం."

- దిల్​బాగ్ సింగ్, జమ్ముకశ్మీర్ పోలీసు చీఫ్

గిలానీ నుంచి బాధ్యతలు..

కొద్దిరోజుల క్రితం ప్రముఖ వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీ... తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించారు. దీనితో ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్​లోని తెహ్రీక్ ఏ హురియత్​ బాధ్యతలను అష్రఫ్ సెహ్రాయ్ స్వీకరించారు. ఇది 26 వేర్పాటువాద సంస్థల సమ్మేళనం.

తేడా ఉంది..

మీర్వైజ్ ఉమర్ ఫారూక్ నేతృత్వంలోని 'హురియత్'​... చర్చల ద్వారా జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించాలని కోరుతోంది. ఈ హురియత్​కు వేర్పాటువాద అష్రఫ్ నేతృత్వంలోని హురియత్​కు ఇదే ప్రధానమైన తేడా.

హిజ్బుల్ ముజాహిదీన్ డివిజినల్ కమాండర్ అయిన సెహ్రాయ్ కుమారుడు జునైద్ సెహ్రాయ్.. ఈ ఏడాది మేలో నవాకాడల్ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో మరణించాడు.

ఇదీ చూడండి: 'కరోనాపై పోరులో భద్రతా దళాల కృషి అమోఘం'

Last Updated : Jul 12, 2020, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.