తల్లిదండ్రులు తెచ్చిన సంపాదనతో ఆడుతూ.. పాడుతూ.. హాయిగా గడపాల్సిన వయస్సు ఆ బాలికది. కానీ కరోనా మహమ్మారి వల్ల తనే ఆ కుటుంబానికి ఆధారంగా నిలిచింది. రిక్షా తొక్కుతూ.. తనవాళ్లను పోషిస్తోంది బిహార్ రోహతాస్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల నందిని కుమారి.
ఏం జరిగిందంటే..!
దేశంలో కరోనా పరిస్థితుల వల్ల ఎందరో జీవితాలు చిన్నా భిన్నమైపోయాయి. మరెంతో మంది తమ జీవనోపాధి కోల్పోయారు. ఆ కోవకు చెందినదే నందిని కుటుంబం కూడా. తన తండ్రి రోజంతా రిక్షా తొక్కి తెచ్చిన సంపాదనతో ఇళ్లు గడిచేది. నందిని కూడా వయసులో చిన్నదే అయినా.. ఓ ఇంట్లో పనిమనిషిగా ఉంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది.
అయితే మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో.. తన తండ్రి ఉపాధిపై దెబ్బపడింది. అదే సమయంలో పనిమనిషిగానూ ఉపాధి కోల్పోయింది నందిని. ఇక పూట గడవడమే ఎంతో కష్టమైంది ఆ కుటుంబానికి. ఆ ఇబ్బందులను చూసి ఓర్వలేక ఆ కుటుంబ భారాన్ని తనపై వేసుకుంది నందిని. ఓ రిక్షాను అద్దెకు తీసుకుని, రోజంతా రిక్షా తొక్కి.. వచ్చిన డబ్బులతోనే తల్లిదండ్రులను పోషిస్తోంది ఆ బాలిక.
ఇదీ చూడండి: రాజస్థాన్: బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!