ETV Bharat / bharat

చంద్రయాన్​-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు

ఎవరూ ఇప్పటివరకు సాధించని లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఉక్కు సంకల్పం, యోగ్యత అవసరం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేసే శాస్త్రవేత్తలకు అవి పుష్కలంగా ఉంటాయి. చంద్రయాన్‌-2 మిషన్‌ కోసం వెయ్యి మందికిపైగా శాస్త్రవేత్తలు ఏళ్ల  తరబడి శ్రమించారు. వారందరికీ నాయకత్వం వహించారు కొంతమంది సీనియర్‌ శాస్త్రవేత్తలు.

చంద్రయాన్​-2: ఒక లక్ష్యం- వెయ్యి మెదళ్లు
author img

By

Published : Sep 6, 2019, 4:30 PM IST

Updated : Sep 29, 2019, 4:01 PM IST

చంద్రయాన్ -2 ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో ఇస్రోలోని ప్రతి శాస్త్రవేత్త సహకారం అమూల్యమైనది. అయితే కొద్దిమంది మాత్రం తమ నాయకత్వంతో ముందుండి నడిపిస్తారు. ఇది అత్యంత క్లిష్టమైన లక్ష్యమే.. కానీ దాన్ని ఎలా చేరుకోవాలో ఇస్రోకు బాగా తెలుసు. గతంలో విజయవంతంగా చేపట్టిన వందలాది మిషన్లే వారికి స్ఫూర్తి. ఈ మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించినందుకు ఇస్రో బృందం... దేశం నుంచి ప్రశంసలను అందుకున్నప్పటికీ, ఈ పనికి నాయకత్వం వహించి, దానిని వాస్తవికత వైపు తీసుకెళ్లడానికి బాధ్యత వహించిన అనేక మంది ముఖ్య సభ్యులు ఉన్నారు.

శివన్‌...

ఇటీవల సంవత్సరాలలో ఇస్రో చేపట్టిన అన్ని ప్రయత్నాలలో తోటి శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి, ఆ సంస్థ ఛైర్మన్‌.. కె. శివన్‌. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శివన్... 1982లో ఇస్రోలో చేరారు. 2006 లో ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్​డీ పూర్తి చేశారు. 1980ల దశకంలో పీఎస్​ఎల్వీ ప్రాజెక్టులో ఆయన పనిచేస్తున్నప్పుడు మిషన్ ప్లానింగ్, మిషన్ డిజైన్, మిషన్ ఇంటిగ్రేషన్ అండ్‌ అనాలిసిస్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.

ఏప్రిల్ 2011 లో జీఎస్​ఎల్వీ ప్రాజెక్టులో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా శివన్​కు బాధ్యతలు అప్పగించారు. ఆయన నేతృత్వంలోనే ఇస్రో ఒకే మిషన్‌ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలిగింది. 2017 ఫిబ్రవరిలో చేపట్టిన ఆ మిషన్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టగలిగే సాంకేతికతలో ఆయన పట్టు సాధించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్​ఎల్వీ ఎమ్​కే-2 ను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇస్రో ఛైర్మన్‌గా ప్రాజెక్ట్, డిజైన్, ప్లానింగ్, లాంచ్ వంటి ప్రతి దశకు ఆయన బాధ్యత వహిస్తారు. ప్రతిదీ ఆయన పరిశీలన, ఆమోదం ద్వారా వెళుతుంది. మిషన్‌కు సంబంధించిన అన్ని నిర్ణయాలను ఛైర్మన్ శివన్‌ మాత్రమే తీసుకుంటారు.

పి. కున్హికృష్ణన్‌...

చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో మరో ముఖ్య శాస్త్రవేత్త.. పి. కున్హికృష్ణన్‌. బెంగళూరులోని యూఆర్​ రావ్​ ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ముందుచూపు, కచ్చితమైన ప్రణాళికకు పేరుగాంచిన కున్హికృష్ణన్‌... షార్‌ డైరెక్టర్‌గా, పీఎస్​ఎల్వీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆయన 13 పీఎస్​ఎల్వీ వరుస మిషన్లు విజయవంతంగా పూర్తిచేశారు. ఉపగ్రహాల డిజైన్‌, అభివృద్ధి, పరిపూర్ణత సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టు డిజైన్‌, అభివృద్ధిలోనూ ఆయన విలువైన సేవలను అదించారు.

విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌...

ఇస్రో ప్రాజెక్టుల్లో విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ సేవలు అమూల్యమైనవి. ఇస్రో చేపట్టే అన్ని మిషన్‌లకు వాహకనౌకలను వీఎస్​ఎస్​సీ రూపొందిస్తుంది. అంతటి ప్రతిష్టాత్మక సంస్థకు డైరెక్టర్‌గా ఎస్​. సోమనాథ్‌ పనిచేస్తున్నారు. చంద్రయాన్‌-2 వాహకనౌక రూపకల్పనలో ఆయన పాత్ర ముఖ్యమైనది. ఇక చంద్రయాన్‌-2 మిషన్‌కు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా మత్తయ్య వనిత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మిషన్‌కు ముందు ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళయాన్‌కు వనిత కీలక పాత్ర పోషించారు. ఉపగ్రహాల రూపకల్పనలో నిపుణురాలైన ఆమె... ఇటువంటి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా శాస్త్రవేత్తగా గుర్తింపుపొందారు. ఆస్ట్రనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి 2006లో ఆమె ఉత్తమ మహిళా శాస్త్రవేత్త అవార్డును అందుకున్నారు.

రీతూ...

చంద్రయాన్ -2 ప్రాజెక్టులో మిషన్ డైరెక్టర్‌గా రీతూ కరిధాల్‌ పనిచేస్తున్నారు. అంతకుముందు మార్స్ మిషన్‌లో డిప్యూటీ ఆపరేషన్‌ డైరెక్టర్‌గా పనిచేసి విజయం సాధించారు. 2007లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా యువ శాస్త్రవేత్త పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆమె 'రాకెట్‌ ఉమన్‌ ఆఫ్‌ ఇండియా'గా గుర్తింపు పొందారు.

అన్నాదురై...

చంద్రయాన్‌-2 ప్రాజెక్టులో మరో కీలక వ్యక్తి మైలస్వామి అన్నాదురై. ఈ మిషన్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆయన ఉన్నారు. అంతకుముందు మంగళయాన్‌, చంద్రయాన్‌1 మిషన్‌లకూ ఆయన ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌. చంద్రయాన్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌గా ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ- ఈఎస్​ఏ,జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్పొరేషన్‌ ఏజెన్సీలు ఇస్రో భాగస్వామ్యంతో పనిచేసే విధంగా ఆయన కృషి చేశారు.

చంద్రయాన్‌-2లో రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్‌, ఆప్టికల్‌ పేలోడ్‌ డాటా ప్రాసెసింగ్‌ విభాగాలకు డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్లుగా చంద్రకాంత కుమార్‌, అమితాబ్‌ సింగ్‌ సేవలు కూడా విలువైనవి. వీరందరితోపాటు మరెన్నో మెదళ్లు 2008 నుంచి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉన్నాయి. వాటి లక్ష్యం ఒకటే. విక్రమ్‌ రోవర్‌ను చంద్రుడిపై నడిపించడం.

Raipur (Chhattisgarh), Sep 06 (ANI): Members of Bairagi family from Chhattisgarh's Raipur, distribute home-made, eco-friendly, re-usable bags, free of cost. The family intends to make the city single-use plastic free. Surendra Bairagi said, "My wife makes these bags using old clothes, we have distributed hundreds of these bags to people." Asserting on the hazard of single-use plastic on environment, Prime Minister Narendra Modi on August 15 urged people and shopkeepers to eliminate the use of plastic bags completely.
Last Updated : Sep 29, 2019, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.