ETV Bharat / bharat

కరోనాపై 'టాటా' పోరాటం.. రూ. 1500 కోట్ల సహాయానికి సిద్ధం - Tata Trusts and Tata Sons

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారీ సహాయంతో ముందుకొచ్చింది టాటా వ్యాపార సంస్థ. వైరస్​ను ఎదుర్కొనేందుకు కేంద్రానికి రూ.1500 కోట్లు అందించనుంది. ఈ మేరకు టాటా గ్రూప్​ ఛైర్మన్​ రతన్​ టాటా ప్రకటన చేశారు.

Tata Group(Tata Trusts and Tata Sons) announced 1,500 Crore Rupees towards coronavirus relief fund
కరోనాపై టాటా పోరాటం.. రూ. 1500 కోట్లతో సాయానికి సిద్ధం
author img

By

Published : Mar 28, 2020, 8:27 PM IST

కరోనాపై పోరాటం చేస్తోన్న ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు, అనేక వ్యాపార సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా టాటా సంస్థ తరఫున రూ.1500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు టాటా గ్రూప్​ ఛైర్మన్​ రతన్​ టాటా తెలిపారు. టాటా సన్స్​ నుంచి రూ.1000 కోట్లు.. టాటా ట్రస్ట్ రూ.500 కోట్లు వెచ్చించనున్నాయి. ఫలితంగా మొత్తం టాటా గ్రూప్​ విరాళం రూ.1500 కోట్లకు చేరింది.

" కొవిడ్​-19 విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేమూ సిద్ధమే. దేశ అవసరాల కోసం టాటా గ్రూప్​ ఆఫ్​ కంపెనీస్​, టాటా ట్రస్ట్​ ఎప్పుడూ ముందజలో ఉంటుంది"

--రతన్​టాటా ట్వీట్​

ఈ భారీ మొత్తాన్ని ఖర్చు చేసే విధానాన్ని ఆయన వివరించారు. వైద్యసేవల పరికారాల కొనుగోలుకు, శ్వాసకోశ వైద్యానికి కావాల్సిన పరికరాలకు వెచ్చించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రతీ ఒక్కరికీ సరిపడేలా టెస్టింగ్ కిట్లకు, బాధితులకు అత్యాధునిక వైద్య సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని ఖర్చుచేయనున్నారు. వీటితో పాటు వైద్యసేవలు చేసేవారికి, ప్రజలకు దీనిపై మరింత అవగాహన కార్యక్రమాలు కల్పించేందుకు ఖర్చు చేస్తామని రతన్​ టాటా వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.