ETV Bharat / bharat

బిహార్​ డిప్యూటీ సీఎంగా తారకిషోర్!

బిహార్​ భాజపా శాసనసభాపక్షనేతగా సీనియర్​ నాయకుడు తారకిషోర్​ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా తార కిషోర్​ ప్రసాద్​ను ఎంపిక చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Deputy CM_Bihar
తార కిషోర్​ను అభినందించిన బిహార్​ డిప్యూటీ సీఎం
author img

By

Published : Nov 15, 2020, 6:06 PM IST

Updated : Nov 15, 2020, 6:27 PM IST

బిహార్​ ఉపముఖ్యమంత్రిగా సుశీల్​కుమార్​ మోదీ లాంఛనమే అనుకున్న నేపథ్యంలో భాజపా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్​ నాయకుడు తారకిషోర్​ ప్రసాద్​ను​ భాజపా శాసనసభా పక్షనేతగా నియమించింది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సుశీల్​ కుమార్ మోదీ స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. శాసనసభాపక్ష ఉపనేతగా రేణుదేవి ఎంపికైనట్లు తెలిపారు. తారకిషోర్, రేణుదేవిని ఈ సందర్భంగా అభినందించారు సుశీల్​ మోదీ.

భాజపా మొదట... సుశీల్​ కుమార్​ మోదీనే బిహార్​ ఉపముఖ్యమంత్రిగా కొనసాగిస్తుందని భావించారు. అయితే ఇప్పుడు తారకిషోర్​ పేరు బయటకువచ్చింది. ఆయనకు డీప్యూటీ సీఎం బాధ్యతనిచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

బాధ్యతగా విధులు నిర్వహిస్తా....

తనకు బాధ్యతలు అప్పగించడంపై తారకిషోర్​ స్పందించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవిపై ఇప్పుడే స్పందించలేనని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'బంగాల్​.. ఉగ్రవాదులకు అడ్డాగా మారింది'

Last Updated : Nov 15, 2020, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.