ETV Bharat / bharat

మహారాష్ట్ర, కేరళలో తగ్గిన కరోనా కేసులు

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 60 లక్షలు దాటగా.. మరో 95 వేల మందికిపైగా మృతి చెందారు. మహారాష్ట్ర, కేరళలో కొత్త కేసులు కాస్త తగ్గాయి.

TamilNadu reported 5,589  new COVID19 cases and 70 deaths today
మహాలో ఆగని కరోనా- కేరళలో తగ్గిన కేసులు
author img

By

Published : Sep 28, 2020, 9:00 PM IST

దేశంలో మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. మహారాష్ట్రలో తాజాగా 11 వేల 921మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 13లక్షల 51 వేలు దాటింది. తాజాగా మరో 180మంది మృతి చెందారు. అయితే కేసుల కంటే రికవరీలే అధికంగా ఉండటం విశేషం. ఒక్కరోజే 19,932 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

తమిళనాడులో కొత్తగా 5 వేల 589మందికి కరోనా సోకింది. మరో 70 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,86,397 చేరింది.

తగ్గిన కేసులు

కేరళలో గత రెండు రోజుల్లో వరుసుగా ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా... కాస్త తగ్గుముఖం కనిపించింది. కొత్తాగా 4,538 మంది వైరస్​ బారిన పడ్డారు.

  • ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 3,838 కేసులు బయటపడగా.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 90 వేలు దాటింది. తాజాగా మరో 58 మంది చనిపోయారు.
  • దిల్లీలో తాజాగా 1,984మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2.73 లక్షలు దాటింది. మరో 37మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5,272కు పెరిగింది.
  • ఝార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగన్నాథ్​ మెహతాకు కొవిడ్​ సోకింది. ఈ మేరకు ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా తెలిపారు.
  • కర్ణాటక మాజీ మంత్రి, సీనియర్​ కాంగ్రెస్ నేత హెచ్​కె పాటిల్​కు కరోనా సోకింది. ఆయన ఇటీవలే మహారాష్ట్ర కాంగ్రెస్​ ఇంచార్జ్​గా నియమితులయ్యారు​. మహాలో క్షేత్రస్థాయిలో జరిగిన సమావేశాలకు హాజరు కావడం వల్లే కరోనా సోకినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'భారత సైన్యానికి నలుగురు విరోధులతో పోరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.