భారత్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, కర్ణాటకలో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి.
తమిళనాడులో మరో 3 వేల 756 మంది కొవిడ్ బారినపడ్డారు. మరో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసులు లక్షా 22 వేల 350కి చేరాయి. ఇప్పటివరకు 1700 మంది కరోనాకు బలయ్యారు.
కేరళలో మళ్లీ..
తొలుత కరోనా వ్యాప్తిని అరికట్టిన కేరళలో మళ్లీ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇవాళ కొత్తగా 301 కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2605 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి కేేకే శైలజ తెలిపారు.
30 వేలు ప్లస్..
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొవిడ్ కేసులు 30 వేలు దాటాయి. బుధవారం 1188 మంది వైరస్ బాధితులుగా మారారు. మరో 18 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 845కు చేరింది.
బిహార్‌లో మరో 749 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 13 వేల 274కు పెరిగింది.
హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా కేసులు 1092కు చేరాయి. యాక్టివ్ కేసులు 260 ఉన్నాయి.
దేశంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న.. మహారాష్ట్రలోని ధారావిలో మాత్రం కేసులు తగ్గుతున్నాయి. అక్కడ కొత్తగా మరో ముగ్గురికి కరోనా సోకింది.
ప్రముఖుల్లోనూ భయం భయం..
- తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి తంగమణికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
- బెంగళూరు మేయర్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన పీఏకు కరోనా సోకడమే కారణం.
- ఝార్ఖండ్‌లో ఓ మంత్రికి కరోనా సోకింది. ఆయన ఇటీవలే ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. సీఎం హేమంత్ సోరెన్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు.