భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, దిల్లీ, రాజస్థాన్, దిల్లీల్లో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 5,024 మందికి కరోనా సోకింది. 175 మరణాలు (24 గంటల్లో 91) నమోదయ్యాయి. మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 1,52,765కు పెరిగింది. ఇప్పటివరకు 7,106 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం అక్కడ 65,829 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తమిళనాడులో..
తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 3,645 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొత్తగా 46మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 74,622కు చేరింది. ఇప్పటివరకు 957 మంది ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం ఒక్కరోజే 33,675 వైరస్ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 10,42,649 టెస్టులు నిర్వహించారు.
దిల్లీలో మరో 63మంది..
దేశ రాజధాని దిల్లీలో 24 గంటల్లో 63మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3,460 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇక్కడ ఇప్పటివరకు 2492 మరణాలు సంభవించగా.. కేసుల సంఖ్య 77,240 గా ఉంది.
గుజరాత్లో 580 మందికి..
రాష్ట్రంలో కొత్తగా 580 మందికి వైరస్ సోకింది. 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా కేసుల సంఖ్య 30,158కి చేరింది. మరణాల సంఖ్య 1,772కు పెరిగింది. ఇప్పటివరకు 22,038 మందికి వైరస్ నయమైంది.
ఆ రాష్ట్రంలో 4వేలకు చేరువలో కేసులు..
కేరళలో ఒక్కరోజులోనే 150 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో మహమ్మారి బాధితుల సంఖ్య 4వేలకు చేరువైంది. అక్కడ ఇప్పటివరకు 3,876 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 1,846 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,006 మందిలో వైరస్ నయమైంది.
కర్ణాటకలో 11వేలు దాటిన కేసుల సంఖ్య..
24 గంటల వ్యవధిలో.. కర్ణాటకలో 455మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. రాష్ట్రంలో 11,005 మందికి ఇప్పటివరకు కరోనా సోకింది. 180 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,196 మందికి వైరస్ నయమైంది. 3905 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
బంగాల్లో రికార్డు..
బంగాల్లో కొత్తగా 542మందికి కరోనా నిర్ధరణ అయింది. 10మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 16,190 కి పెరిగింది. మరణాల సంఖ్య 616గా ఉంది. యాక్టివ్ కేసులు 5,039గా ఉన్నాయి.
ఒక్కరోజులో 421మందికి..
హరియాణాలో ఒక్కరోజులో 421మందికి వైరస్ సోకింది. మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 12,884గా ఉంది. ఇప్పటివరకు 211మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 4,657 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పంజాబ్‌లో 188 కేసులు..
పంజాబ్‌లో కొత్తగా 188మందికి కరోనా ఉన్నట్లు తేలింది. మొత్తంగా కేసుల సంఖ్య 4,957 గా ఉండగా.. 122 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చూడండి: చైనా సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం వేగవంతం