దక్షిణాది రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ పండుగ వచ్చిందంటే చాలు ఊరూరా సందడి నెలకొంటుంది. ముఖ్యంగా పశువుల పందేలకు పెట్టింది పేరు సంక్రాంతి. తమిళనాడులో అయితే సంప్రదాయ క్రీడ జల్లికట్టు ఎంతో ప్రత్యేకం.
మధురై జిల్లాలో బుధవారం ప్రారంభం కానున్న జల్లికట్టు పోటీలు జనవరి 31 వరకు జరగనున్నాయి. ఇందుకోసం ఔత్సాహికులు సర్వసన్నద్ధమవుతున్నారు. అవనియపురం నుంచి 730 బసవన్నలు బరిలోకి దిగనున్నాయి. అలంగానల్లూరు నుంచి 700, పలమేడు నుంచి 650 ఎద్దులు జల్లికట్టు పోటీలో పాల్గొననున్నాయి.
కాలుదువ్వుతున్న కోడిపుంజులు
సంక్రాంతి బరిలోకి కోడిపుంజులూ దిగుతున్నాయి. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో గురువారం కోడి పందేలు ప్రారంభం కానున్నాయి.
ఇదీ చూడండి:'5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే కాదు.. అంతకు మించి'