కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేంత వరకు.. భారత్‌కు తమ గ్రూప్‌నకు మధ్య సత్సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదని తాలిబన్‌కు చెందిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై.. తాలిబన్ రాజకీయ విభాగంగా చెప్పుకొనే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్ స్పందించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్థాన్ మీడియా ప్రతినిధి సుహైల్ షాహీన్ తెలిపారు.
పొరుగు దేశాల అంతర్గత అంశాల్లో తలదూర్చొద్దన్నదే తమ విధానమని తేల్చిచెప్పారు సుహైల్.
సోషల్ మీడియాలో వస్తున్న నిరాధార వార్తలను సమగ్రంగా పరిశీలించిన భారత్ ..తాలిబన్ ఎలాంటి ప్రకటన చేయలేదని ముందుగానే గుర్తించింది.
అఫ్గాన్ ఖండన..
అవినీతిపరులతోనే భారత్ చేయి కలుపుతుందని, విదేశీయులు అఫ్గానిస్థాన్‌లో అధికారం దక్కించుకునేందుకు ప్రోత్సహిస్తుందని.. ఖతార్ ఆధారిత రాజకీయ కార్యాలయం డిప్యూటీ మౌలా అబాస్ ఆరోపించారు. వీటిని అఫ్గానిస్థాన్ విదేశాంగశాఖ ఖండించింది. అఫ్గానిస్థాన్ అభివృద్ధికి భారత్ తోడ్పడుతోందని స్పష్టం చేసింది.