ETV Bharat / bharat

నేటి నుంచి తాజ్​మహల్​ సందర్శన షురూ - tourist places reopen news

కరోనా వైరస్​ విజృంభణతో మూతపడిన పర్యటక ప్రదేశాలకు అనుమతులు ఇస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో నేటి నుంచి తాజ్​మహల్​ సహా ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల సందర్శన ప్రారంభం కానుంది. కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు పర్యటకులను అనుమతించనున్నట్లు పురావస్తు శాఖ వెల్లడించింది.

Taj Mahal to reopen
నేటి నుంచి తాజ్​మహల్​ సందర్శన షురూ!
author img

By

Published : Jul 6, 2020, 6:31 AM IST

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ సహా ఎర్రకోట, ఇతర చారిత్రక కట్టడాల సందర్శన నేటి నుంచి ప్రారంభం కానుంది. అన్​లాక్​లో భాగంగా పలు పర్యటక కేంద్రాలను పునఃప్రారంభించేందుకు సర్కార్​ అనుమతిచ్చింది. నేటి నుంచి ఈ ప్రాంతాల్లో సందడి షురూ కానుంది. కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు పర్యటకులను అనుమతించనున్నట్లు పురావస్తు శాఖ తెలిపింది.

రోజుకు 5వేలు..

పాలరాతి కట్టడాన్ని చూసేందుకు రోజుకు 5వేల మందికి మాత్రమే పాస్‌లు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిని కూడా బృందాలుగా విభజించి సందర్శనకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. మాములు రోజుల్లో దాదాపు 80 వేలమంది పర్యటకులు తాజ్‌మహల్‌ను దర్శించేవారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోజుకు 5 వేల మందిని మాత్రమే అనుమతించినట్లు పురావస్తు శాఖ పేర్కొంది.

ఈ ప్రేమకట్టడాన్ని చూసేందుకు తాజ్‌మహల్‌ ప్రాంగణంలో పర్యటకులు విధిగా వ్యక్తిగతదూరం పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు. చారిత్రక కట్టడాలను తాకకూడదని పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి: రోజుకు 24కి.మీ సైకిల్​ తొక్కుతూ విజయ తీరాలకు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.