ETV Bharat / bharat

'ఠాగూర్​ గడ్డపై మత రాజకీయాలు సాగవు'

మత రాజకీయాలను రవీంద్రుడి నేల అంగీకరించదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ అన్నారు. విభజన రాజకీయాలతో విశ్వభారతి విశ్వవిద్యాలయం గొప్పతనాన్ని భాజపా దెబ్బతీయాలనుకుంటోందని మండిపడ్డారు.

author img

By

Published : Dec 29, 2020, 5:11 PM IST

Updated : Dec 29, 2020, 5:32 PM IST

Tagore's land will never allow hate politics to overpower secularism: Mamata
"మత రాజకీయాలను ఠాగూర్​ భూమి అంగీకరించదు"

లౌకికవాదాన్ని అతిక్రమించే రాజకీయాలను నోబెల్​ గ్రహిత రవీంద్రనాథ్ ఠాగూర్​ నడయాడిన నేల అంగీకరించదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఉద్ఘాటించారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్​లర్​ విద్యుత్​ చక్రవర్తి భాజపా మనిషని ఆరోపించారు. కళాశాలలో మత రాజకీయాలను సృష్టించి, వారసత్వ గొప్పదనాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారని మండిపడ్డారు.

బోల్​పుర్​లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో భాజపాపై నిప్పులు చెరిగారు మమత.

మహాత్మగాంధీ వంటి మహానుభాహులను గౌరవించనివారు బంగారు బంగాల్​ను నిర్మిస్తామంటున్నారు. దశాబ్దాల క్రితమే రవీంద్రుడు బంగారు బెంగాల్​ను తయారు చేశారు. భాజపా మత రాజకీయాల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడం మన విధి. భాజపా బయట వ్యక్తులు పాలించేది.

-మమతా బెనర్జీ, పశ్చిమ బంగా సీఎం

టీఎంసీ ఫిరాయింపులపై స్పందించిన మమత.. కొంతమంది ఎమ్మెల్యేలను కమలదళం తీసుకోవచ్చు కానీ తమ పార్టీని కొనలేరని అన్నారు.

ఇదీ చదవండి: '200 స్థానాలు గెలుస్తాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

Last Updated : Dec 29, 2020, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.