ETV Bharat / bharat

'తబ్లిగీ జమాత్​ వల్లే కరోనా విజృంభణ' - తబ్లిగీ జమాత్​ వల్లే దేశంలో కరోనా వ్యాప్తి

దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాత్​ ప్రధాన కారణమని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో.. ముస్లింలు ఆ సమావేశాలకు హాజరయ్యారని తెలిపింది. అక్కడ భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడం కొవిడ్​ విజృంభణకు దారితీసిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​ రెడ్డి.

Tablighi Jamaat event caused COVID-19 to spread to many persons
తబ్లిగీ జమాత్​ వల్లే కరోనా విజృంభణ
author img

By

Published : Sep 21, 2020, 9:25 PM IST

మార్చి నెలలో దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ కారణంగానే దేశంలో ఎక్కువ మందికి కరోనా సోకినట్లు రాజ్యసభలో తెలిపింది కేంద్ర హోంశాఖ. ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు.. సమాధానమిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి.

అయితే.. ఇప్పటివరకు 233 తబ్లిగీ జమాత్ సభ్యులను అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. మార్చి 29 నుంచి ఆ సంస్థ ప్రధాన ప్రాంగణం నుంచి 2,361 మందిని బయటకు తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు. జమాత్ అధ్యక్షుడు మౌలానా మొహ్మద్ సాద్‌పై దర్యాప్తు సాగుతోందన్నారు.

ఈ కార్యక్రమం జరిగే నాటికే దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. సభా ప్రాంగణంలో వేలాది మంది భౌతికదూరం నిబంధనల్ని విస్మరించి సమావేశాలకు హాజరయ్యారని తెలిపారు. ఇది కూడా కరోనా మరింతగా విస్తరించడానికి కారణమైందన్నారు కిషన్​ రెడ్డి.

ఇదీ చదవండి: 'ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించకపోగా ప్రజలపై నిందలా?'

For All Latest Updates

TAGGED:

TABLIGI
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.