దేశ రాజధాని దిల్లీలో స్వైన్ఫ్లూ ప్రబలుతోంది. మూడు నెలల్లో స్వైన్ ఫ్లూ బారిన పడి 21 మంది మృతి చెందారు. 3వేల500 స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దిల్లీలో గత 9 ఏళ్లలో కేవలం మూడు నెలల్లో 21 మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. 2015 సంవత్సరంలో 4వేల307 స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 2010లో ఈ సంఖ్య 2వేల725. మొత్తంగా స్వైన్ఫ్లూ వల్ల 77 మంది ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయారు. ఇది సాధారణమైన అస్వస్థతే కానీ ఆరోగ్యపరమైన సమస్యలున్న వారిపై స్వైన్ఫ్లూ ప్రభావం అధికంగా ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు.
"స్వైన్ఫ్లూ అనేది సాధారణమైన జ్వరం. ఇది వాతావరణం ద్వారా వ్యాప్తి చెందుతుంది. గర్భవతులు, చిన్నపిల్లలు, వృద్ధులపై, రోగగ్రస్తులపై వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది. ఇలాంటి వారికే ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉంది. ఇన్ఫ్లూఎన్జా వైరస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. మనుషులపై హెచ్1 ఎన్1 వైరస్ అధిక ప్రభావం చూపిస్తుంది. చనిపోయిన వారిలో చాలామంది అనారోగ్య కారణాలతో బాధపడుతున్నవారు, చిన్న పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అయ్యే అవకాశం ఉంది. స్వైన్ఫ్లూ అంటువ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. "
-డాక్టర్. అఫ్రోజ్ జమాల్, రామ్మనోహర్ లోహియా ఆస్పత్రి సీనియర్ రెసిడెంట్ వైద్యుడు
ఇదీ చూడండి:అంతరిక్షంలోనూ భారత్కు చౌకీదార్: మోదీ