కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్, మరో నిందితుడు సందీప్‌ను బెంగళూరు నుంచి కేరళకు తిరిగి తీసుకువచ్చారు అధికారులు. వీరిని కొచ్చిలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచే ముందు కరోనా పరీక్షల నిమిత్తం ఎర్నాకులంలోని అలువా ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి తీసుకువస్తున్నట్లు తెలుసుకున్న కాంగ్రెస్, భాజపా కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు అమలు అవుతున్న తరుణంలో నిందితులిద్దరూ కేరళ దాటి ఎలా వెళ్లారో ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ కేసు...
ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన కేరళలోని ఆ దేశ కాన్సులేట్‌కు వచ్చిన పార్సిల్లో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు గుర్తించారు. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్ అనే వ్యక్తి వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిత్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు సాగించారు. తర్వాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు... శనివారం బెంగళూరులో స్వప్న, సందీప్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం