ETV Bharat / bharat

రియా పిటిషన్​పై ఆగస్టు 5న సుప్రీం విచారణ - రాజ్​పుత్​

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మరణానికి సంబంధించి తనపై పట్నాలో దాఖలైన కేసును.. ముంబయికి బదిలీ చేయాలన్న రియా చక్రవర్తి పిటిషన్​ను స్వీకరించింది సుప్రీం కోర్టు. ఆగస్టు 5న ఈ వ్యాజ్యంపై విచారణ జరపనుంది. అయితే.. కేసు తీర్పునకు ముందు తమ వాదనలు కూడా వినాలని.. మహారాష్ట్ర, బిహార్​ పోలీసులతో పాటు సుశాంత్​ తండ్రి కూడా సుప్రీంలో కేవియట్​ దాఖలు చేశారు.

Sushant Singh Rajput's death: SC to hear Rhea Chakraborty's plea on Aug 5
రియా పిటిషన్​పై ఆగస్టు 5న సుప్రీం విచారణ
author img

By

Published : Aug 1, 2020, 12:58 PM IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో.. అతడి మాజీ స్నేహితురాలు రియా చక్రవర్తి వేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరించింది సుప్రీం కోర్టు. బిహార్​లోని పట్నాలో తనపై దాఖలైన కేసును ముంబయికి బదిలీ చేయాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై ఆగస్టు 5న విచారణ జరగనుంది. సుశాంత్‌ సింగ్ బలవన్మరణానికి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబసభ్యులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్‌సింగ్ తండ్రి పట్నాలో కేసు నమోదు చేశారు. దీనిపై సుప్రీంకు వెళ్లిన రియా ఆ కేసును ముంబయికి బదిలీ చేయాలని కోరారు.

జస్టిస్​ హృషికేశ్​ రాయ్​ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ పిటిషన్​లో వాదనలు విననుంది.

అయితే ఈ కేసులో ఏదైనా నిర్ణయాన్ని వెల్లడించే ముందు తమ వాదనలు కూడా వినాలని మహారాష్ట్ర పోలీసులు, బిహార్‌ పోలీసులతో పాటు సుశాంత్‌సింగ్ తండ్రి కూడా సుప్రీంలో కేవియట్ దాఖలు చేశారు.

ఇదీ చూడండి: 'సుశాంత్​ కేసును రాజకీయం చేయొద్దు'

ఆత్మహత్య...

నటుడు.. సుశాంత్​ జూన్​ 14న ముంబయి బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి ఈ కేసులో వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పలువురు సినీ ప్రముఖుల్ని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 'సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.