జాతీయ భద్రతపై రూపొందించిన నివేదికను రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సమర్పించారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 2016లో భారత సైన్యం చేసిన లక్షిత దాడుల్లో హూడా ప్రముఖ పాత్ర పోషించారు.
గత ఫిబ్రవరిలో హూడా అధ్యక్షతన ఓ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన రాహుల్ భారతదేశ భద్రతపై ఓ 'దార్శనిక పత్రం' సమర్పించాలని కోరారు.
"లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) డీఎస్ హూడా, అతని బృందం కలిసి 'జాతీయ భద్రత'పై ఓ సమగ్ర నివేదిక రూపొందించారు. ఆ నివేదికను ఈ రోజు నాకు అందించారు. ఈ విస్తృత నివేదికపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాం." - రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ట్వీట్
లక్షిత దాడుల వీరుడు
2019లో భారత సైనిక స్థావరం 'ఉరీ'పై ఉగ్రదాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం 2016 సెప్టెంబర్ 29న ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న 7 ఉగ్రవాద స్థావరాలను సర్వనాశనం చేసింది. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా ప్రముఖ పాత్ర వహించారు. జాతీయ వీరుడుగా గుర్తింపు పొందారు.
ఇదీ చూడండి:కాంగ్రెస్ కవర్ డ్రైవ్.. కేరళ నుంచి రాహుల్