ETV Bharat / bharat

శబరిమల, రఫేల్​ కేసులపై సుప్రీం తీర్పు నేడే! - supreme court verdict on rafale issue

సుప్రీంకోర్టు ఇవాళ మూడు కీలక కేసుల్లో తీర్పు వెలువరించనుంది. రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా దాఖలైన రివ్యూ పిటిషన్లపై​ తీర్పునివ్వనుంది. వీటితో పాటు రాహుల్ గాంధీ​ కోర్టు ధిక్కరణ కేసుపైనా నిర్ణయం తీసుకోనుంది.

శబరిమల, రఫేల్​ కేసులపై సుప్రీం తీర్పు నేడే!
author img

By

Published : Nov 14, 2019, 5:17 AM IST

శబరిమల, రఫేల్​ కేసులపై సుప్రీం తీర్పు నేడే!

దేశంలోనే అత్యంత సున్నితమైన అయోధ్య కేసు తీర్పును శనివారం వెలువరించింది సుప్రీం కోర్టు. మరో మూడు కీలక కేసులపై అత్యున్నత న్యాయస్థానం నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. రఫేల్​ ఒప్పందం, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కోర్టు ధిక్కరణ కేసులపై తీర్పునివ్వనుంది సర్వోన్నత న్యాయస్థానం. వీటిల్లో రఫేల్​, శబరిమల సమీక్షా వ్యాజ్యాలు.

శబరిమల కేసు...

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ గతేడాది సెప్టెంబర్​లో సంచలన నిర్ణయం తీసుకుంది సుప్రీం. అనాదిగా ఉన్న ఆనవాయితీని అత్యున్నత న్యాయస్థానం మార్చడంపై కేరళ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శబరిమల ఆలయ వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం జోక్యానికి వ్యతిరేకంగా 65 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో 56 రివ్యూ పిటిషన్లు.

ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం... ఈ ఏడాది ఫిబ్రవరి 6న తీర్పును వాయిదా వేసింది.

రఫేల్​ కేసు...

అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న మరో ముఖ్య కేసు రఫేల్​. 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కేంద్రానికి వ్యతిరేకంగా గతంలో సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం... డిసెంబర్​ 14న కేంద్రానికి క్లీన్​ చిట్​ ఇచ్చింది.

అయితే... అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్రం తప్పుదోవ పట్టించిందంటూ సీనియర్​ న్యాయవాది ప్రశాంత భూషణ్​, మాజీ కేంద్ర మంత్రులు అరుణ్​ శౌరి, యశ్వంత్​ సిన్హా రివ్యూ పిటిషన్​ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీం... ఈ ఏడాది మే 10న తీర్పును రిజర్వు చేసింది.

రాహుల్​ గాంధీ కేసు...

'చౌకీదార్​ చోర్​ హై' అనే నినాదాన్ని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ సుప్రీంకోర్టుకు ఆపాదించారనే ఆరోపణలతో భాజపా నేత మీనాక్షి లేఖి.. అత్యున్నత న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన సుప్రీం... రాహుల్​ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఇందుకు అంగీకరించిన రాహుల్​.. సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసు కొట్టివేయాలని అభ్యర్థించారు. ఈ కేసుపైనా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం వెలువరించనుంది.

ఇదీ చూడండి: ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న టమాటా ధరలు..!

Ganderbal (J-K), Nov 12 (ANI): One terrorist was killed in an encounter that broke out between terrorists and security forces in Jammu and Kashmir's Ganderbal on Nov 12. The encounter happened in Gund area of Ganderbal. Arms and ammunition were recovered from terrorist's possession. It comes after two terrorists, linked to Lashkar-e-Taiba (LeT), were neutralised in an encounter with security forces in Bandipora on Nov 11.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.