ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల్లో వెంటనే అరెస్టు చేయరాదని 2018 మార్చి 20న ఇచ్చిన ఆదేశాలను సుప్రీం ఉపసంహరించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ.....కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సమ్మతించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ,ఎస్టీలు ఇప్పటికీ అంటరానితనం, సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సమానత్వం కోసం వీరు చేస్తోన్న పోరాటం ఇంకా ముగియలేదని వ్యాఖ్యానించింది.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల్లో వెంటనే అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై తీవ్ర దుమారం రేగడం వల్ల కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేసింది.