మహారాష్ట్రలో విద్య, ఉద్యోగాలలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అయితే ఇప్పటికే ఈ చట్టం వల్ల లబ్ధి పొందినవారికి ఎలాంటి భంగం వాటిల్లదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎల్ఎన్ రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ అంశాన్ని సీజేఐ ఎస్ఏ బోబ్డేతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఏమీటీ చట్టం.?
మహారాష్ట్రలో మరాఠా వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనకు 2018లో ఓ ప్రత్యేక చట్టం చేశారు. 16శాతం రిజర్వేషన్ కల్పించిన ఈ చట్టానికి ఆ రాష్ట్ర శాసనసభ అదే ఏడాది నవంబర్ 30న ఆమోద ముద్ర వేసింది.
సమర్థించిన బాంబే హైకోర్టు..
గతేడాది జూన్లో బాంబే హైకోర్టు ఈ చట్టాన్ని సమర్థించింది. అయితే... 16 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని తప్పుబట్టింది. ఉద్యోగాల్లో 12 శాతం, ప్రవేశాల్లో 13 శాతానికి మించరాదని స్పష్టంచేసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.
ఇదీ చదవండి: మరాఠాల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నోటీసులు