ETV Bharat / bharat

సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​కు సుప్రీంకోర్టు అనుమతి

Supreme Court approves Central Vista project
సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​కు సుప్రీంకోర్టు అనుమతి
author img

By

Published : Jan 5, 2021, 10:45 AM IST

Updated : Jan 5, 2021, 11:34 AM IST

10:44 January 05

సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​కు సుప్రీంకోర్టు అనుమతి

కొత్త పార్లమెంట్ సహా ప్రభుత్వ భవనాల ఆధునికీకరణ కోసం కేంద్రం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. పర్యావరణ అనుమతులు ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ఏకీభవించిన జస్టిస్‌ ఖన్విల్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2-1 తేడాతో తీర్పు వెలువరించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ జస్టిస్ దినేష్ మహేశ్వరి కేంద్రం వాదనలతో ఏకీభవించగా జస్టిస్ సంజీవ్ ఖన్నా వేరుగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రాజెక్టు డిజైన్, స్థలం కేటాయింపు, పర్యావరణ అనుమతులని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు కాగా.. అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం మంగళవారం తీర్పును రిజర్వు చేసి ఇవాళ వెలువరించింది.

ఈ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు సహా భూ వినియోగానికి సంబంధించి మార్పులు చేస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. నిర్మాణం జరిగే ప్రదేశాల్లో స్మోక్ టవర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులు ఊపందుకోనున్నాయి.  

ఇదీ చూడండి: 'సెంట్రల్​ విస్టా' ప్రాజెక్ట్​పై నేడు సుప్రీం తీర్పు

Last Updated : Jan 5, 2021, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.