అత్యధిక వేగంతో ప్రయాణించే సూపర్‌సోనిక్ సముద్రతల క్షిపణి బ్రహ్మోస్‌ను రక్షణశాఖ, డీఆర్డీఓ (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశా చంఢీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) లోని మూడో కాంప్లెక్స్ నుంచి ఈ క్షిపణిని పరీక్షించినట్లు డీఆర్డీఓ అధికారులు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్‌ను సముద్రతలం సహా భూ, గగనతలాల నుంచీ ప్రయోగించవచ్చని అధికారులు వివరించారు. 290 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్‌తో అత్యంత కచ్చితత్వంతో బ్రహ్మోస్ పనిచేస్తుంది.
ఈ క్షిపణి చైనా, పాకిస్థాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడంలో సహాయపడుతుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. డీఆర్డీఓ , రష్యాకు చెందిన ఎన్పీఓఎంతో కలిసి బ్రహ్మోస్‌ను రూపొందించింది.
- ఇదీ చూడండి: గిరిరాజ్‌ను మందలించిన హోంమంత్రి అమిత్ షా