జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా పూంచ్ జిల్లా ప్రాంతాలోకి ఏకంగా సూపర్సోనిక్ క్షిపణులను పంపింది. మంగళవారం రాత్రి నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ యుద్ధ విమానాలు పెద్ద శబ్దంతో దూసుకెళ్లాయి. ఈ ఘటనతో భారత వాయి సేన అప్రమత్తమైంది.
ఫిబ్రవరి 27న భారత గగనతలంలోకి ప్రవేశించాలని చూసిన పాక్ విమానాలను భారత వైమానిక దళంసమర్థంగా తిప్పికొట్టింది. అప్పటి నుంచి పాక్కు చెందిన డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించాయి. వాటిని సైన్యం నేలకూల్చింది.