బాలీవుడ్ నటుడు సన్నీ దేఓల్ భాజపాలో చేరారు. దిల్లీలో రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇటీవలే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను పుణె విమానాశ్రయంలో కలిశారు దేఓల్.
"అటల్ బిహారీ వాజ్పేయీతో మా తండ్రి ధర్మేంద్రకు మంచి అనుబంధం ఉండేది. అలాగే ఈరోజు నేను మోదీతో జట్టుకట్టాను. ఈ భాజపా కుటుంబం కోసం ఏదైనా చేస్తాను. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా"
-సన్నీ దేఓల్, బాలీవుడ్ నటుడు
దేఓల్ను పంజాబ్ గురుదాస్‌పుర్ లేక ఛండీగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దించాలని భాజపా భావిస్తోంది. గుర్దాస్పుర్కు ఇంతకుముందు భాజపా దివంగత నేత వినోద్ ఖన్నా ప్రాతినిధ్యం వహించారు.
ఇదీ చూడండీ: జోరుగా పోలింగ్ - మూడో వంతు ఓటింగ్ పూర్తి