ETV Bharat / bharat

డయాబెటిక్​ రోగుల కోసం ప్రత్యేక మామిడి పండ్లు! - గిర్​ మామిడి

వేసవికాలం అంటే టక్కున గుర్తొచ్చేది మామిడి పండు. అందులో 'కేసర్'​ రకం మామిడి అనగానే సహజంగానే నోరూరుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఈ మామిడి పళ్లకు డయాబెటిక్​ రోగులు మాత్రం దూరంగా ఉండాల్సిందే. గ్లూకోజ్​  అధికస్థాయిలో ఉండటమే ఇందుకు కారణం. అయితే చక్కెర స్థాయుల గురించి చింతించకుండా మధుమేహ వ్యాధిగ్రస్థులూ తినేలా.. మరో కొత్త రకం మామిడిని పండిస్తున్నాడు గుజరాత్​లోని ఓ రైతు. ఆ వివరాలు మీకోసం...

Sugar-free mango growing in Gir will be available in market or diabetics
డయాబెటిక్​ రోగుల కోసం ప్రత్యేక మామిడి పండ్లు!
author img

By

Published : May 31, 2020, 5:35 AM IST

డయాబెటిక్​ రోగుల కోసం ప్రత్యేక మామిడి పండ్లు!

మామిడి పళ్లు అనగానే గుర్తొచ్చేది.. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేసర్​. అయితే ఇందులోని అధిక చక్కెర స్థాయిల కారణంగా.. డయాబెటిక్​ రోగులు ఈ పళ్లకు దూరంగా ఉండక తప్పదు. ఇలాంటి వారికి తీపికబురునందిస్తూ గుజరాత్​లోని గిర్​లో ఓ రైతు.. కొత్త రకం మామిడిని పండిస్తున్నాడు. ఫ్లోరిడాలో 'షుగర్​ ఫ్రీ మ్యాంగో'గా పేరుగాంచిన 'టామ్​ ఆట్కిన్స్​' మామిడి రకాన్ని పండించి విజయవంతమయ్యాడు దినేశ్​ గాదయ్య. డయాబెటిక్​ వ్యాధిగ్రస్థుల కోసం త్వరలోనే ఈ మామిడి మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.

చక్కెర తక్కువ, క్యాలరీలెక్కువ..

ఇతర మామిడి రకాలతో పోలిస్తే 'టామ్​ ఆట్కిన్స్'​లో చక్కెర స్థాయిలు సుమారు 75 శాతం వరకు తక్కువగా ఉంటాయి. క్యాలరీలు ఎక్కువే. ఫలితంగా మిగతా రకం మామిడితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు ఏ చింతలేకుండా దీనిని ఆస్వాదించవచ్చు. ఫ్లోరిడాలో అభివృద్ధి చెందిన ఈ మామిడి రకం తొలుత ఉత్తరాఖండ్​లోని నైనిటాల్​కు.. అక్కడి నుంచి గిర్​కు వచ్చింది.

ఉత్పత్తిని పెంచేదిశగా..

ముదురు వైలెట్​ రంగులో కనిపించే ఈ మామిడి ప్రస్తుతం గాదయ్య వద్ద ఒకే చెట్టు ఉంది. ఇటీవల సుమారు 25 కిలోల పండ్లను ఉచితంగా పంచాడు దినేశ్​. మధుమేహ వ్యాధిగ్రస్థుల నుంచి మంచి స్పందన రావడం వల్ల.. ఇప్పుడు ఈ ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు​.

'టామ్​ అట్కిన్స్​' మామిడిని మరికొన్ని దేశాల్లో 'బ్లాక్​ మ్యాంగో' అని కూడా పిలుస్తారని నిపుణులు తెలిపారు.

ఇదీ చదవండి: గ్రామస్థులపై చిరుత దాడి- కర్రలతో తరిమికొట్టిన ప్రజలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.