కేరళలో పాము కాటుతో విద్యార్థిని మృతి చెందిన ఘటనను మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. మావెలిక్కర ప్రాంతంలోని ఓ పాఠశాలలో.. అకస్మాత్తుగా తలపై బ్యాట్ పడటం వల్ల ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం భోజనం ముగించుకుని చేతులు కడుక్కోవడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని పాఠశాల వర్గాలు తెలిపాయి.
ఇదీ జరిగింది...
మావెలిక్కరలోని చునక్కర ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ముగించుకొని చేతులు కడుక్కొవటానికి వెళ్లాడు 6వ తరగతి విద్యార్థి నవనీత్. అదే సమయంలో పాఠశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు తోటి విద్యార్థులు.
ఓ విద్యార్థి చేతిలో నుంచి బ్యాట్ జారి నవనీత్ తల వెనుక భాగాన్ని బలంగా తాకింది. ఉన్న చోటే అతను కుప్పకూలిపోయాడు నవనీత్. పాఠశాల ఉపాధ్యాయులు అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే నవనీత్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: తప్పిపోయాడనుకుంటే నెదర్లాండ్స్లో ప్రత్యక్షమయ్యాడు..!