ETV Bharat / bharat

'ఆ రసాయనం వాడితే పంటలను తగలబెట్టక్కర్లేదు' - kejriwal writes to javadekar about stubble burning

పంట మొదళ్లను కాల్చడానికి బదులు అతి తక్కువ ఖర్చుతో కూడిన రసాయన సాంకేతికతను ఉపయోగించుకోవాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ తయారు చేసిన రసాయనాన్ని పెద్ద ఎత్తున వినియోగించాలని అభిప్రాయపడ్డారు. దీని ద్వారా పంట మొదళ్లు కుళ్లిపోయి.. ఎరువుగా మారతాయని చెప్పారు.

Stubble burning; Kejriwal writes to Javadekar
పంట దహన సమస్యకు కేజ్రీవాల్ పరిష్కార మార్గం!
author img

By

Published : Sep 26, 2020, 7:37 PM IST

చలి కాలంలో ఓ వైపు మంచు.. మరోవైపు పంజాబ్​, హరియాణా రాష్ట్రాల నుంచి వచ్చే పొగ వల్ల దిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోతుంది. ప్రతి ఏటా ఎదుర్కొనే ఈ ఇబ్బందులకు ఓ పరిష్కారం సూచించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. పంట మొదళ్లను కాల్చడం ద్వారా తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం సూచిస్తూ.. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్​కు లేఖ రాశారు కేజ్రీవాల్.

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్ఐ) అభివృద్ధి చేసిన రసాయన సాంకేతికతను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అతి తక్కువ ఖర్చుతో కూడిన ఈ రసాయనం వల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయని కేజ్రీవాల్​ చెప్పారు.

"ఐఏఆర్​ఐ శాస్త్రవేత్తలు ఓ రసాయనాన్ని అభివృద్ధి చేశారు. ఇది పంట మొదళ్లను కుళ్లిపోయేలా చేసి ఎరువుగా మార్చుతుంది. దీన్ని ఉపయోగిస్తే పంట మొదళ్లను రైతులు కాల్చేయాల్సిన అవసరం లేదు. పంట మొదళ్లను కాల్చివేయడం ద్వారా మట్టి సారాన్ని కోల్పోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి పంట వ్యర్థాలను ఎరువుగా మార్చేస్తే.. ప్రత్యేకంగా ఎరువులు వాడటం తగ్గుతుంది."

-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

పంట దహనాలను అరికట్టేందుకు దిల్లీ ప్రభుత్వం ఈ రసాయనాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించేందుకు సిద్ధమైనట్లు చెప్పారు కేజ్రీవాల్. పొరుగున ఉన్న రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అవలంబించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

రైతుల జేబులకే చిల్లు!

పంట వ్యర్థాల దహనాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషిని కొనియాడారు కేజ్రీవాల్. అయితే ప్రభుత్వాల దృష్టి కేవలం యంత్రాల సాయంతోనే పంట వ్యర్థాల నిర్వహణపైనే ఉన్నట్లు తెలిపారు.

"వ్యవసాయ యంత్రాలను కొనుక్కునేందుకు కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. అయినా రైతులు చాలావరకు డబ్బు తమ జేబుల నుంచే పెట్టాల్సి వస్తోంది. పంట వ్యర్థాలను తొలగించే యంత్రాలు చాలా మంది రైతుల దగ్గర లేవు. కాబట్టి వ్యర్థాలను కాల్చేస్తున్నారు. ఈ రసాయన విధానం ద్వారా ఎరువుల వాడకాన్ని తగ్గించి, పంట ఉత్పత్తిని పెంచవచ్చు. ఇది రైతులకు రెండు విధాలా ఉపయోగపడుతుంది."

-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

ఈ సమస్యపై చర్చించేందుకు సమయం కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు కేజ్రీవాల్.

ఆ రసాయనం ఇదే

'డీకంపోజర్ క్యాప్సుల్స్​' పేరిట ఈ రసాయనాన్ని అభివృద్ధి చేశారు ఐఏఆర్​ఐ నిపుణులు. నాలుగు క్యాప్సుల్స్​ ఉపయోగించి 25 లీటర్ల ద్రావణాన్ని తయారు చేయవచ్చు. బెల్లం, జొన్న పిండి కలయికతో తయారు చేసే ఈ 25 లీ. ద్రావణాన్ని.. హెక్టారు పంటకు ఉపయోగించవచ్చు.

ఇదీ చదవండి- కరోనా వేళ.. ఉత్తర భారతానికి మరో ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.