ETV Bharat / bharat

సాగు చట్టాలపై​ పవార్​ ట్వీట్ల​కు తోమర్​ కౌంటర్​​ - శరద్ పవర్​ కామెంట్స్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలపై ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ట్వీట్​లను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తప్పుపట్టారు. మూడు చట్టాల వల్ల రైతులకు కలిగే లాభాలను అనుభవజ్ఞులైన పవార్​ వివరించాలని హితపు పలికారు.

Stop allegations on three farms laws and Explain benefits of those thomar fired on sharad pawar
'ఆరోపణలు ఆపి... ప్రయోజనాలు వివరించండి పవార్​'
author img

By

Published : Jan 31, 2021, 8:26 PM IST

సాగు చట్టాలను విమర్శిస్తూ ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ట్వీట్లను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తప్పుబట్టారు. రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ఆయన.. వారిని పక్కదారి పట్టించేలా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. పవార్​ చేసిన కొన్ని ట్వీట్లు చట్టంలో ఉన్న వాస్తవాలను ప్రతిబింబించేలా లేవని మండిపడ్డారు. వ్యవసాయ చట్టలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్న తరువాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో పవార్​ కూడా వ్యయసాయ మంత్రిగా పని చేశారన్న తోమర్​... ఆ సమయంలో ఆయన కూడా ఈ రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించారని గుర్తు చేశారు.

ఇటీవల సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం... కార్పొరేట్లు రైతుల నుంచి సరుకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించవచ్చనే భయాలకు దారితీస్తాయని శరద్​పవార్​ ట్వీట్​ చేశారు. ఇందుకు స్పందించిన తోమర్.. పవార్​కు బదులిచ్చారు.

కొత్త చట్టాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎవరికైనా అమ్ముకునే సదావకాశం కల్పింస్తోందని తోమర్ తెలిపారు. కేవలం రాష్ట్రంలోనే కాక బయట విక్రయించి మెరుగైన ధరకు అమ్మకోవచ్చని వివరించారు. దీని వల్ల కనీస మద్దతు ధర ఏ విధంగానూ ప్రభావితం కాదని పేర్కొన్నారు. సాగు చట్టాలతో ప్రస్తుతం ఉన్న మండీల వ్యవస్థ రద్దుకాదని స్పష్టం చేసిన కేంద్రమంత్రి... ధరల విషయంలో వాటి మధ్య మరింత పోటీ నెలకొంటుందని అన్నారు.

ఇదీ చూడండి: 'సాగు చట్టాలను రైతులే నాశనం చేస్తారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.