ETV Bharat / bharat

ప్రయాణాలు చేయాలా? ఈ రూల్స్​ పాటించాల్సిందే... - దేశీయ ప్రయాణాలకు నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ఆరోగ్య మంత్రిత్వశాఖ

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా విమాన, రైలు, అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశీయ ప్రయాణాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం, థర్మల్ స్కానింగ్ తప్పనిసరి అని పేర్కొంది.

States should ensure thermal screening at departure point of airports, stations: Health min
దేశీయ ప్రయాణాలకు ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే!
author img

By

Published : May 24, 2020, 3:39 PM IST

విమాన, రైలు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్ధరణ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశీయ ప్రయాణాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అవి:

  • సంబంధిత ఏజెన్సీలు ప్రయాణికులకు... టికెట్లతో పాటు చేయకూడని, చేయదగిన విషయాలను తెలపాలి.
  • ప్రయాణికులందరూ తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ టెర్మినల్స్... విమానాలు, రైళ్లు, బస్సులలో అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యలతో సహా కరోనా గురించి తగిన ప్రకటనలు చేయాలి.
  • ప్రయాణికులందరూ తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తాయి.
  • కరోనా లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమాన, రైలు, బస్సుల్లో వెళ్లడానికి అనుమతివ్వాలి.
  • బోర్డింగ్, ప్రయాణ సమయంలో ప్రయాణికులందరూ ముఖం కప్పుకుని ఉండాలి లేదా మాస్క్‌ తప్పని సరిగా ధరించాలి.
  • చేతుల పరిశుభ్రత, శ్వాసకోశ పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  • విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్ టెర్మినల్స్ వద్ద భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
  • విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్​ను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి.
  • క్రిమిసంహారకాలను పిచికారీ చేయాలి. సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
  • నిష్క్రమణ పాయింట్ వద్ద కూడా థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
  • రోగ లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజులు వారి ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలన్న సలహాతో వెళ్లడానికి అనుమతి ఇవ్వాలి.
  • ఒకవేళ వారికి ఏవైనా లక్షణాలు కనిపిస్తే.. జిల్లా నిఘా అధికారికి లేదా రాష్ట్ర లేదా జాతీయ కాల్ సెంటర్‌ 1075కు తెలియజేయాలి.
  • రోగలక్షణాలు ఉన్నవారిని వేరుచేసి సమీప కరోనా ఆసుపత్రికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయాలి.
  • మితమైన లేదా తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్‌ చేసి.. సమీపంలో ఉన్న కరోనా‌ చికిత్సా కేంద్రానికి తరలించాలి. అక్కడ చికిత్స ఏ స్థాయిలో తీసుకోవాలో నిర్ణయిస్తారు.
  • తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి ఐసీఎంఆర్‌ నిబంధనల‌ ప్రకారం.. సెల్ఫ్​ ఐసొలేషన్​లో‌ ఉంచడమో లేక కరోనా కేర్ సెంటర్‌లో తగిన చికిత్స అందించడమో చేస్తారు.
  • కరోనా పాజిటివ్‌ అని తేలితే.. క్లినికల్ ప్రోటోకాల్ ప్రకారం కరోనా కేర్ సెంటర్‌లో కొనసాగాల్సి ఉంటుంది.
  • నెగెటివ్‌ వస్తే.. ప్రయాణికులు 7 రోజుల్లో ఇంటికి వెళ్లి, స్వీయ నిర్బంధంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే.. స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్​పై రాష్ట్రాలు సొంత నిబంధనావళిని పాటించవచ్చు.

ఇదీ చూడండి: ఆన్​లైన్ యూజర్లలో 83% మందివి వీక్ పాస్​వర్డ్​లు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.