ETV Bharat / bharat

ఆకాశంలో అగ్గి పిడుగు: 'కవిత'కు వాయుసేన కీలక బాధ్యతలు

యుద్ధ రంగంలో సాహసోపేత విధులు నిర్వర్తించేందుకు తొలిసారి ఓ మహిళకు అవకాశం ఇచ్చింది భారత వాయుసేన. బాంబింగ్, పారాడ్రాపింగ్ చేసేందుకు స్క్వాడ్రన్​ లీడర్​ కవితా బరాలాకు అనుమతి ఇచ్చింది.

kavitha
ఆకాశంలో అగ్గి పిడుగు: 'కవిత'కు వాయుసేన కీలక బాధ్యతలు
author img

By

Published : Mar 8, 2020, 12:09 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు కీలక నిర్ణయం తీసుకుంది భారత వాయుసేన. పురుషులతో సమానంగా కదనరంగంలో ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు తొలిసారి ఓ మహిళకు అనుమతి ఇచ్చింది.

బాంబులు వేయడం, ఎగురుతున్న విమానంలో నుంచి పారాషూట్​ సాయంతో దూకడం వంటి సాహసోపేత విధులు నిర్వర్తించేందుకు స్క్వాడ్రన్​ లీడర్ కవితా బరాలాకు పచ్చజెండా ఊపింది. భారత వాయుసేనలో ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళా నేవిగేటర్​గా గుర్తింపు పొందారు కవిత.

ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు, సమస్యలు లేకుండా 1800 గంటలపాటు విమానాలు నడిపారు కవిత.

ఇదీ చూడండి: శునకాలకు ఏసీ కోసం విద్యుత్ చౌర్యం- రూ.7లక్షలు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.