ETV Bharat / bharat

శునకాలకు ఏసీ కోసం విద్యుత్ చౌర్యం- రూ.7లక్షలు జరిమానా

మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి చేసిన పని అధికారులతో పాటు స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నవీ ముంబయికి చెందిన ఓ వ్యక్తి తన విదేశీ శునకాల కోసం విద్యుత్​ చోరీకి పాల్పడ్డాడు. విద్యుత్ శాఖ అధికారులు అతడిని పట్టుకుని రూ. 7 లక్షల జరిమానా విధించారు.

ac dogs
శునకాలకు ఏసీ కోసం విద్యుత్ చౌర్యం- రూ. 7 లక్షల జరిమానా
author img

By

Published : Mar 8, 2020, 11:15 AM IST

Updated : Mar 8, 2020, 11:48 AM IST

అతడికి శునకాలంటే ప్రాణం. విదేశాల నుంచి తెప్పించిన శునకాలకు అక్కడి ఉష్ణోగ్రతలు కల్పించాలని భావించినట్టున్నాడు. మహారాష్ట్ర నవీముంబయిలోని తన ఇల్లంతా ఏసీలు ఏర్పాటు చేశాడు. వాటికి అనువైన విధంగా ఏసీలను ట్యూన్ చేస్తుండేవాడు. ఇల్లంతా సరిపోయేంత ఏసీ అంటే విద్యుత్ బిల్లు భారీగానే వస్తుంది కదా! ఈ ఖర్చును తప్పించుకునేందుకు విద్యుత్ చోరీకి పాల్పడ్డాడు ఆ వ్యక్తి.

శునకాలకు ఏసీ సౌకర్యం కల్పించడం కోసం విద్యుత్ దొంగతనానికి పాల్పడుతున్నాడని సమాచారం అందుకున్నారు మహారాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు. నిందితుడిని పట్టుకున్నారు. 34, 465 యూనిట్ల విద్యుత్ అక్రమంగా ఖర్చు చేశాడని నిర్ధరించి.. రూ. 7 లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే జరిగే పరిణామాలు తెలిసిన ఈ శునక ప్రియుడు కిక్కురుమనకుండా జరిమానా కట్టేశాడని చెప్పారు అధికారులు.

"నిందితుడు విదేశాల నుంచి తెచ్చిన శునకాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం తన ఇల్లంతా ఏసీలు బిగించాడు. రోజంతా ఏసీలను ఆన్ చేసి ఉంచేవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు అతడి ఇంటిపై దాడి చేసి విద్యుత్ చోరీ చేస్తున్నట్లు గుర్తించాం. చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నాం."

- మహారాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులు

ఇదీ చూడండి: స్మార్ట్​ఫోన్​కు బానిసయ్యారా? బయట పడండిలా

Last Updated : Mar 8, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.