కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్ కొందరు మహిళలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. ఇళ్లకే పరిమితమవుతున్న కొందరు పురుషులు తమ పైశాచికత్వాన్ని భార్యలపై ప్రదర్శిస్తూ గృహ హింసకు పాల్పడుతున్నారు.
మార్చి 24 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ)కు.. మహిళలపై హింసకు సంబంధించి మొత్తం 257 ఫిర్యాదులు అందాయి. అందులో 69 గృహ హింసకు సంబంధించివి ఉన్నాయి.
మహిళా హింసకు సంబంధించి... 90కేసులతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా దిల్లీ(37) 2వ స్థానంలో ఉంది.
అత్యాచారం, వరకట్నం వేధింపులు వంటి కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది ఎన్‌సీడబ్ల్యూ.
ఇదీ చూడండి : ఎయిమ్స్ వైద్యుడు, గర్భిణి భార్యకు కరోనా