సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ కుమార్ సిన్హాను మరో ఏడాదిపాటు ప్రత్యేక భద్రతా దళం (ఎస్పీజీ) డైరెక్టర్గా కొనసాగిస్తూ సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ప్రధానులకు, ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్పీజీ రక్షణను కల్పిస్తోంది.
2020 మార్చి 19 నుంచి 2021 జులై 30 వరకు కాల పరిమితి పొడిగిస్తూ మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం 1988 నాటి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టాన్ని సవరించింది. ఈ సవరించిన చట్టం ప్రకారం ప్రధాన మంత్రికి, మాజీ ప్రధానులకు మాత్రమే ఎస్పీజీ అధికారులు నిర్ణీత కాలం వరకు భద్రతను కల్పించనున్నారు.
ఇదీ చూడండి:పోలీసుల చర్యలను నిరసిస్తూ దిల్లీలో లెఫ్ట్ పార్టీల ధర్నా