ETV Bharat / bharat

మరాఠావాదమే శరద్​ పవార్ వెనకున్న బలం - ఎన్సీపీ అధినేత

అసలు ఈ కురువృద్ధుడికి ఇంతబలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు అండగా నిలుచున్నదేమిటి..? ఓటమికి, బెదిరింపులకూ లొంగని మొండితనమా...? ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఇచ్చిన బలమా? ప్రస్తుత పరిణామాలకు కాస్త పక్కకు జరిగి చూస్తే... ఈ ప్రశ్నలకు కనిపించే ఒకే ఒక్క సమాధానం... మరాఠావాదం. మొదటి నుంచి ఆయనకు అండగా ఉంది మరాఠా సామాజిక వర్గమే. అందుకే ఆయన మరాఠా యోధుడిగా...ప్రాచుర్యం పొందారు. ఇవాళ ఆయన శిబిరంలోని ఎమ్మెల్యేలు ఇతరపార్టీలకు లొంగకపోవటానికి కారణం కూడా ఆ భావోద్వేగ మంత్రమే.. దానితో శరద్‌పవార్‌కు ఉన్న అనుబంధమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

special story of ncp chief sharad pawar maharashtra
మరాఠావాదమే శరద్​ పవార్ వెనకున్న బలం
author img

By

Published : Nov 26, 2019, 10:19 PM IST

మరాఠావాదమే శరద్​ పవార్ వెనకున్న బలం

మరాఠా వాదం! మహారాష్ట్రలో బాగా వినిపించే పదం. ఈ పదం వినగానే మొదట గుర్తకు వచ్చేది.. ఎన్​సీపీ అధినేత శరద్ పవార్. అంతగా.. ఆ సామాజికవర్గ మద్దతు కూడగట్టుకున్నారాయన. మొన్నజరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54స్థానాల్లో పార్టీ విజయం సాధించిందంటే కారణం మరాఠా సామాజిక వర్గమే. పశ్చిమ మహారాష్ట్రలో వీరి జనాభా అధికంగా ఉంటుంది. ఎన్​సీపీ గెలుచుకున్న 54 స్థానాల్లో దాదాపు 26 స్థానాలు పశ్చిమ మహారాష్ట్రలోనివే. అంటే.. మరాఠా వాదం ఇక్కడ ఎంతగా వేళ్లూనుకుని ఉందో అర్థం చేసుకోవచ్చు.

భావోద్వేగ ప్రసంగాలు

భాజపా.. ఈ సామాజిక వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినా తగినంత రీతిలో ఉద్యోగాలు కల్పించకపోవటంపై యువతలో అసహనం వ్యక్తమైంది. సరిగ్గా ఇదే సమయంలో తన అనుభవం రంగరించి ఆ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకున్నారు పవార్. ముఖ్యంగా ఆ వర్గం యువతను ఆకర్షించటంలో విజయం సాధించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో దిల్లీకి, మహారాష్ట్ర గౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందంటూ భావోద్వేగ ప్రసంగాలు చేశారు. ఫలితంగా మరాఠాలు ఎక్కువ మంది ఎన్‌సీపీ వైపు మొగ్గు చూపారు.

సామాజికవర్గమే కలిసొచ్చింది

ఇప్పుడీ మరాఠా వాదం చర్చకు రావటానికి కారణం.. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న కుర్చీలాటే. తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ ఇతర పార్టీల తాయిలాలకు ఆశపడకుండా ఉన్నారంటేనే వాళ్లకు శరద్‌ పవార్‌పై ఎంత నమ్మకం, గౌరవం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా ఈ నమ్మకమే.. ఇవాళ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా నిలువరించాయనటంలో అతిశయోక్తి లేదు. ఎన్​సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువభాగం మరాఠా సామాజిక వర్గానికి చెందిన వారే కావటం కలిసొచ్చిన అంశం.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంటే...పార్టీ మారితే...తమకూ ఈ పరిస్థితి తప్పదని ఎమ్మెల్యేలు భావించి ఉండొచ్చు. అందుకే శరద్ పవార్ శిబిరం నుంచి ఎలాంటి కప్పదాట్లు కనిపించలేదు. ఉన్నట్టుండి అజిత్ పవార్ రాజీనామా చేయటం వెనుక శరద్ పవార్ వ్యూహం సామాన్యమైందేమీ కాదు. అంటే...అటు మరాఠా వాదంతో పాటు...తన రాజకీయ అనుభవం తోడవటం వల్ల మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తీసుకున్నాయి.

పార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉంటారన్న ధీమా మొదట్నుంచీ వ్యక్తం చేస్తూనే వచ్చారు శరద్ పవార్. తన 52 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇలాంటివెన్నో చూశానని ఆయన చేసిన వ్యాఖ్యల్లో నమ్మకం ప్రతిబింబించింది. అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్యేలందరూ శిబిరం వీడకుండా ఉండటం శరద్‌ పవార్ సాధించిన విజయమే.

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:  
SOUTH KOREAN POOL  – NO ACCESS SOUTH KOREA
Busan - 26 November 2019
1. South Korean President Moon Jae-in (right) and Laos Prime Minister Thongloun Sisoulith shaking hands
2. Various of meeting between South Korean and Laos delegations
3. Various of Moon and Sisoulith standing by podium
4. Various of signing of memorandum of understanding
5. Moon and Sisoulith shaking hands and leaving the room
STORYLINE:
South Korea has promised to help Laos become a transportation hub in south-east Asia, Korean media said Tuesday.
The pledge came during talks between South Korean President Moon Jae-in and Laos Prime Minister Thongloun Sisoulith.
The two leaders met in Busan where South Korea has been hosting a two-day summit of the Association of South-East Asian Nations (ASEAN).
The ASEAN leaders have been discussing cooperation on common challenges in economic, socio-cultural, regional and security areas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.