ETV Bharat / bharat

నేడే బాబ్రీ కేసు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ - ఎల్​కే అడ్వాణీ బాబ్రీ తీర్పు

బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పును వెలువరించనుంది. భాజపా సీనియర్​ నేతలు ఎల్​కే అడ్వాణీ, ఎమ్​ఎమ్​ జోషీ సహా 32మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరందరు కోర్టు ఎదుట హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్​కే యాదవ్​ ఆదేశించారు. తీర్పు నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.

special-court-set-to-pronounce-verdict-in-babri-mosque-demolition-case-on-wednesday
నేడే బాబ్రీ మసీదు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ
author img

By

Published : Sep 30, 2020, 5:00 AM IST

బాబ్రీ మసీదు కేసులో బుధవారం ఉదయం 10:30 గంటలకు తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఈ నేపథ్యంలో.. కేసులో నిందితులందరూ కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్​కే యాదవ్ ఇప్పటికే​ ఆదేశాలిచ్చారు.

బాబ్రీ కేసులో మొత్తం 49మందిని నిందితులుగా గుర్తించగా.. వీరిలో 17మంది మరణించారు. మిగిలిన 32మంది నిందితుల జాబితాలో.. భాజపా సీనియర్​ నేతలు ఎల్​కే అడ్వాణీ, ఎమ్​ఎమ్​ జోషితో పాటు ప్రముఖ నేతలు ఉమాభారతి, కల్యాణ్​ సింగ్​ తదితరులు ఉన్నారు.

అయితే.. కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ఇటీవలే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె రిషికేష్ ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అనుమతి ఇస్తే కోర్టుకు హాజరవుతానని సోమవారం ట్వీట్ ద్వారా వెల్లడించారు.

351మంది సాక్ష్యులు...

విచారణ సందర్భంగా.. మొత్తం 351మంది సాక్ష్యులను కోర్టు ఎదుట హాజరుపరిచింది సీబీఐ. 600లకుపైగా ఆధారాలను డాక్యుమెంటరీ రూపంలో కోర్టుకు సమర్పించింది.

భద్రత కట్టుదిట్టం

బాబ్రీ కేసు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలో భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి- బాబ్రీ కేసులో కోర్టు తీర్పునకు కట్టుబడి ఉంటా: ఉమాభారతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.